Thursday, April 17, 2025
Homeలేటెస్ట్ న్యూస్ములుగు జిల్లా కేంద్రంగా భూ కంపం..

ములుగు జిల్లా కేంద్రంగా భూ కంపం..

ములుగు జిల్లా కేంద్రంగా భూ కంపం..

తెలుగు రాష్ట్రాల్లో కంపించిన భూమి 

భూమి కంపించిన వీడియో మీకోసం

స్పాట్ వాయిస్, బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్లు భూప్రకంపనలు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో స్వల్పంగా 2 సెకన్ల పాటు భూమి కంపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్పల్ప భూప్రకంపనలు వచ్చాయి. కొత్తగూడెం, మణుగూరు, చర్ల, భద్రాచలం, నాగులవంచ మండలాల్లో భూమి కంపించింది. మరోవైపు విజయవాడలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. జగ్గయ్యపేట పట్టణం, పరిసర గ్రామాల్లో భూప్రకంపనలు వచ్చాయి. అపార్టుమెంట్ల నుంచి ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.

ములుగు జిల్లా కేంద్రoగా..

గోదావరి జిల్లా పరివాహక ప్రాంత జిల్లాల్లో స్పల్పంగా భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. ములుగు కేంద్రంగా ఉదయం 7.27 గంటలకు స్వల్ప భూకంపం వచ్చింది. భూకంపకేంద్రం నుంచి 225 కి.మీ. మేర పరిధిలో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై 5.3 భూకంప తీవ్రత నమోదైంది. పెద్దపల్లి, సిద్దిపేట, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. జగిత్యాలలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. మహబూబ్నగర్ జిల్లాలో స్వలంగా భూప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రం నుంచి 225 కి.మీ. మేర పరిధిలో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై 5.3 భూకంప తీవ్రత నమోదైంది. పెద్దపల్లి, సిద్దిపేట, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. జగిత్యాలలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. మహబూబ్నగర్ జిల్లాలో స్వలంగా భూప్రకంపనలు వచ్చాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments