Thursday, December 5, 2024
Homeక్రైమ్వృద్ధుడిపై హత్యాయత్నం...

వృద్ధుడిపై హత్యాయత్నం…

వృద్ధుడిపై హత్యాయత్నం…

కత్తితో విచక్షణారహితంగా దాడి..

పట్టుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై పెట్రోల్ చల్లి బెదిరింపు…

బాధితుడిని ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు..

విచారణ చేపట్టిన పోలీసులు…

స్పాట్ వాయిస్, కాజీపేట: కాజీపేట పట్టణం బాపూజీ నగర్ లో ఓ వృద్ధుడిపై గుర్తుతెలియని యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచి హత్యాయత్నం చేశాడు. మంగళవారం రాత్రి జరిగిన ఘటన వివరాలు స్థానికుల కథనం ప్రకారం… బాపూజీ నగర్ లోని హెచ్ పీ పెట్రోల్ బంక్ వెనుక అలువాల మాలకొండయ్య అనే వృద్ధుడు కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. ఆయన దాదాపు 40 ఏళ్లుగా సిమెంట్ రింగుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటి లాగే దుకాణం మూసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఇంటి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి సంచిలో తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాడిలో వృద్ధుడు మాల కొండయ్యకు తీవ్ర గాయాలపాలయ్యాడు. తండ్రి పై దాడి చేస్తున్న వ్యక్తిని పట్టుకునేందుకు మాలకొండయ్య చిన్న కుమారుడు ప్రయత్నించడంతో ఆ యువకుడు వెంట తెచ్చుకున్న సంచుల నుంచి పెట్రోల్ ప్యాకెట్లను మీద చల్లుతూ పరుగులు తీశారు.‌ వెంటనే కుటుంబ సభ్యులు కొండయ్యను దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments