Thursday, December 5, 2024
Homeతెలంగాణగురుకుల బాట ఉద్రిక్తత

గురుకుల బాట ఉద్రిక్తత

గురుకుల బాట ఉద్రిక్తత

ఏనుగుల రాకేష్ రెడ్డి అరెస్టు..

స్పాట్ వాయిస్ , హన్మకొండ: మడికొండలో సోషల్ వెల్ఫేర్ ఆశ్రమ గురుకుల పాఠశాలలో మంగళవారం బీఆర్ఎస్ గురుకుల బాట చేపట్టారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి , కార్పొరేటర్ లు రాధిక రెడ్డి, రవి నాయక్ ఆధ్వర్యంలో సందర్శన నిమిత్తం ఆశ్రమ పాఠశాలకు వెళ్ళారు. అయితే బీఆర్ఎస్ నాయకులను ఆశ్రమ పాఠశాలలోనికి రానియ్యకుండా పోలీసులు అడ్డుకున్నారు. వారితో పాటు 50 మంది కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి మడికొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

విడిచి పెట్టo..

ఈ సందర్భoగా బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. అరకొర వసతులతో నిర్వహిస్తున్న గురుకులాల తీరును మార్చేందుకు సమస్యలను తెలుసుకోవడానికి గురుకుల బాట చేపట్టామన్నారు. సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన మమ్మల్ని ఆపడం విడ్డూరంగా ఉందన్నారు. మేం సంఘ విద్రోహ శక్తులం కాదు కదా? అని ప్రశ్నించారు. విద్యార్థులకు మావంతు సహాయం చెయ్యడానికి వచ్చాం తప్పా రాజకీయాలు చెయ్యడం కోసం కాదు అన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పదినెలల కాలంలోనే 49 విద్యార్థులు మరణించారని , సుమారు 1500 మంది ఆస్వస్తకు గురై ఆసుపత్రి పాలయ్యారని ఆరోపించారు. గురుకుల పాఠశాలల పిల్లలు హాస్టల్ లో కంటే హాస్పిటల్ లోనే ఎక్కువగా ఉంటున్నారని విమర్శించారు. అంతా బాగుంటే లోపలికి అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను గేటు దగ్గర కాపలాకు పెట్టడం దారుణమన్నారు. సమస్యలకు పరిష్కారం చూపకుండా ప్రభుత్వం ఇలాంటి నిర్బంధాలకు పాల్పడడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. గురుకులాలు బాగయ్యే వరకూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంబడిస్తూనే ఉంటామని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments