Thursday, December 5, 2024
Homeజిల్లా వార్తలుఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలి

ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలి

ఎస్ ఆర్ ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపాల్ సనత్ కుమార్
స్పాట్ వాయిస్ నర్సంపేట : వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఆదివారం నర్సంపేట పట్టణంలోని ఎస్ఆర్ ఒకేషనల్ జూనియర్ కళాశాల ఎన్ ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులతో ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో కాలేజీ చైర్మన్ కొయ్యడి సనత్ కుమార్ మాట్లాడుతూ.. ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి, కలుషిత సిరంజీలతో ఎయిడ్స్ వ్యాధి సంక్రమిస్తుందన్నారు. కాబట్టి అందరూ ఎయిడ్స్ గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. ర్యాలీలో ఎయిడ్స్ పై విద్యార్థులు నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ లయన్ ప్రవీణ్, కళాశాల లెక్చరర్స్ పాలడుగుల సంతోష్, రమేష్, కుమార్, దేవ్ సింగ్, సునీత, షారోన్, సూరయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments