Thursday, December 5, 2024
Homeలేటెస్ట్ న్యూస్సంక్రాంతి తర్వాత రైతు భరోసా పైసలు

సంక్రాంతి తర్వాత రైతు భరోసా పైసలు

సంక్రాంతి తర్వాత రైతు భరోసా..
మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ పూర్తయిందన్న సీఎం
స్పాట్ వాయిస్, బ్యూరో: రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత రైతుభరోసా నిధులు జమచేస్తామని సీఎం ప్రకటించారు. ఆదివారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని, అసెంబ్లీలో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. మారీచుల మాయ మాటలు రైతులు నమ్మొద్దని చెప్పారు. వరికి రూ.500 బోనస్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతోనే భోజనం వడ్డించేలా ఆదేశాలు ఇచ్చామని అన్నారు. రూ. 16 వేల కోట్ల మిగులుతో తెలంగాణను కేసీఆర్‌కు అందిస్తే, పదేళ్ల తర్వాత రూ.7 లక్షల అప్పులతో రాష్ట్రాన్ని తమకు అప్పగించారని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల కాలంలో ఏ ప్రభుత్వం ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేయలేదన్న సీఎం 2018 నుంచి 2023 వరకు ఐదేళ్లలో తీసుకున్న రుణాలన్నీ ఏకకాలంలో తీర్చినట్లు వివరించారు.

రుణమాఫీ పూర్తయింది..
రూ.2 లక్షల వరకు ఉన్న అందరికీ రుణమాఫీ పూర్తయ్యిందని సీఎం చెప్పారు. ఖాతాల్లో పొరపాట్ల వల్ల ఆగిపోయిన వారికి శనివారం రుణమాఫీ చేశామని తెలిపారు. ఏమైనా మానవ తప్పిదాలతో జరగకపోతే మళ్లీ సరిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఖాతాల్లో తప్పులు సరిదిద్దుకుని అధికారులకు చెప్తే రుణమాఫీ పూర్తవుతుందన్నారు. రేషన్‌కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేశామని, మొదట్లో బ్యాంకు అధికారులు రుణమాఫీపై సరైన సమాచారం ఇవ్వలేదు. బ్యాంకుల్లోని మొత్తం పాతబకాయిలు కలిపి రూ.30 వేల కోట్లుగా లెక్క చెప్పారన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments