పరస్పర తోడ్పాటు అవసరం
బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ వార్షికోత్సవంలో వక్తలు
ఘనంగా 5వ వార్షికోత్సవ వేడుకలు
స్పాట్ వాయిస్, హన్మకొండ: స్నేహితుల మధ్య తోడ్పాటు అవసరమని బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ బాధ్యులు అన్నారు. ఆదివారం హన్మకొండలో నిర్వహించిన బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ 5వ వార్షికోత్సవంలో వంద మందికి పైగా సభ్యులు హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్బంగా ఫౌండేషన్ వ్యవస్థపాక అధ్యక్షుడు పులి దేవేందర్ మాట్లాడుతూ.. జీవిత ప్రయాణంలో స్నేహితుల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుంది అన్నారు. చిన్ననాటి నుంచి స్నేహితుల వల్ల మంచి చెడు పై అవగాహన పొందే అవకాశం ఉంటుందన్నారు. సుమారు వేయి మంది సభ్యులుగా ఉన్నా బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఇప్పటి వరకు చేసిన సేవ కార్యక్రమాలను దేవేందర్ ఈ సందర్భంగా వివరించారు. అనంతరం ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు బోనాల రమేష్, మధు,భాస్కర్ సంయుక్తంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తాము ఎదగడంతో పాటు తోటి వారి ఎదుగుదల కు సహకారం అందించినప్పుడు సమాజంలో మార్పు వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ స్నేహభావం కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బంది మాత్రమే కాకుండా స్నేహితులకు ఎలాంటి ఆపద వచ్చిన బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ముందుంటుందని తెలిపారు. ఫౌండేషన్ బాధ్యులు పొన్నం రాజు,నరేష్ మాట్లాడుతూ ఫౌండేషన్ లో సభ్యులుగా ఉండడం,సేవ చేయడం సంతోషకరం అన్నారు. ఈ సమావేశంలో బెస్ట్ ఫౌండేషన్ సభ్యులు పొన్నం రాజు,రాజేందర్, భాస్కర్ సురేష్ నాయుడు, రఘు మూర్తి సంతోష్, మధుసూదన్,నరేష్,పవన్ కళ్యాణ్,ప్రభాకర్, శ్రీను, ప్రసాద్,సాయి కృష్ణ,శ్రీధర్, వెంకటయ్య,రాజమౌళి, లక్ష్మణ్ లతో పాటు బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.తదితరులు పాల్గొన్నారు.
పరస్పర తోడ్పాటు అవసరం
RELATED ARTICLES
Recent Comments