అదుపు తప్పి కారు బోల్తా
బెలూన్లు తెరచుకోవడంతో తప్పిన ముప్పు
స్పాట్ వాయిస్, గణపురం: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంట్ పోల్ కు ఢీకొని బోల్తాపడిన ఘటన గణపురం మండలంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్రలోని అంకీసాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వరంగల్ నుంచి గణపురం మండల కేంద్రానికి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామం దాటిన తర్వాత రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను గమనించక పోవడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కరెంటు స్తంభానికి ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బెలూన్స్ తెరచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా వారిని వరంగల్ లోని ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ సంఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Recent Comments