Sunday, November 24, 2024
Homeజనరల్ న్యూస్చిన్న కాళేశ్వరానికి రూ.571 కోట్ల కేటాయింపు

చిన్న కాళేశ్వరానికి రూ.571 కోట్ల కేటాయింపు

రెండేళ్లలో 45 వేల ఎకరాలకు సాగునీరు
స్పాట్ వాయిస్, కాటారం: మంథని నియోజకవర్గం పరిధిలోని 63 గ్రామాలను సస్యశ్యామలం చేయనున్న చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2007లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు 75శాతం పూర్తయ్యాయి. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో ప్రభుత్వం ఎత్తపోతల పథకాన్ని తక్షణం పూర్తి చేయాలసిన ప్రాజెక్టుల జాబితాలో చేర్చింది. ఈ మేరకు శనివారం ఎర్రమంజిల్ జలసౌథలో నీటి పారుదల, పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఉన్నతాధికారులతో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర్) ఎత్తిపోతల పథకం పనులకు రూ.571.57 కోట్ల పరిపాలన అనుమతి లభించినట్టు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

45 వేల ఎకరాలకు సాగునీరు, అర టీఎంసీ నీటిని మంచి నీటి సరఫరా కోసం వినియోగించనున్నట్టు ఆయన తెలిపారు. గోదావరి నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని తరలించి కన్నెపల్లి వద్ద ఒకటో పంప్ హౌజ్ ద్వారా 4.2 టిఎంసీల నీరు దిగువన రెండో పంప్ హౌజ్ కు నీరు సరఫరా అవుతుంది. మొదటి పంపు హౌజ్ సెకనుకు 600 క్యూబిక్ ఫీట్ల నీటిని ఎత్తిపోస్తుంది. అక్కడి నుంచి మందిరం చెరువు, ఎర్ర చెరువుకు నీటి సరఫరా జరుగుంది. మిగిలిన నీరు రెండో పంపు హౌజ్ కు చేరుతుంది. కాటారంలో ఏర్పాటు చేసే రెండో పంపు హౌజ్ ద్వారా గారెపల్లి, పోలారం, తాండ్ర, యెల్లాపూర్, కొత్తపల్లి, రుద్రారం, ధన్వాడ, ఆదివారం పేట, గుమ్మలపల్లి, వీరాపూర్, గూడూర్ చెరువులకు గోదావరి జలాలు చేరనున్నాయి. ఈ పథకంలో భాగంగా ఎర్ర చెరువు సామర్థ్యాన్ని పెంచనున్నారు. వరదకు తెగిపోయిన రుద్రారం చెర్వు గండిని పూడ్చి బలోపేతం చేసే పనులు కూడా పూర్తి కావచ్చాయి. రానున్న రెండేళ్లలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి చెరువుల ద్వారా సాగునీరు అందించాలని నీటి పారుదల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments