Tuesday, December 3, 2024
Homeక్రైమ్రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి..

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి..

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

మహబూబాబాద్ జిల్లా లో ఘటన 

స్పాట్ వాయిస్, క్రైమ్ : మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారి పల్లి వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ సినిమా హాల్లో పనిచేస్తున్న ఇద్దరు యువకులు విధులు ముగించుకుని బైక్ పై వస్తున్నారు. ఈ క్రమంలోనే అయ్యగారి పళ్లి వద్ద ఆగి ఉన్న టిప్పర్ ను వెనుక నుండి ఢీకొట్టారు. ఇందులో వల్లపు కుమార్ స్వామి (19), వెంపటి విశాల్(22) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులిద్దరిది కురవి మండలం సూదనపల్లి గ్రామం. ఈ దుర్ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments