Monday, November 18, 2024
Homeతెలంగాణమామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ముందడుగు..

మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ముందడుగు..

మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ముందడుగు..

 రూ. 205 కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కారు.

 19న పనులు ప్రారంభించనున్న సీఎం రేవంత్

 స్పాట్ వాయిస్, వరంగల్ : వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ముందడుగు పడింది. ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్లను విడుదల చేస్తూ తెలంగాణ సర్కారు జీవో జారీ చేసింది. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపీఆర్ ను సిద్ధం చేయాలని ఎయిర్ పోర్ట్ అథారిటీకి లేఖ రాసింది. కాగా, ఆర్ అండ్ బీ శాఖ. మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జీఎమ్మాఆర్ సంస్ విరమించుకుంది. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ పరిధిలో 696 ఎకరాల భూమి ఉండగా, 253 ఎకరాల భూమిలో కొంత రన్ వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్), నెవిగేషనల్ ఇన్ స్ట్రూమెంట్ ఇన్ స్టలేషన్ విభాగాల కోసం నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక చొరవతో మామూనూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ముందడుగు పడింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 19న వరంగల్‌లో పర్యటించనుండగా.. ఇందులో భాగంగానే మామునూరు విమానాశ్రయ పనులను ఆయన ప్రారంభించనున్నట్లుగా సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments