అనర్హత.. అర్హత.
కడియంలో టెన్షన్..
తీర్పు వ్యతిరేకంగా వస్తే..
ఏం చేయాలి.
ఎలా ముందుకెళ్లాలి.. ఎలా..ఎలా..: కూతురికి టికెట్ కోసం కాంగ్రెస్‌లో చేరిన శ్రీహరితో పాటు తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్ పై బీఆర్ఎస్ అనర్హత వేయలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. సింగిల్ బెంచ్ నుంచి డివిజన్ బెంచ్ కు వెళ్లిన ఈ కేసు విచారణ మంగళవారం చేపట్టారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ లో టెన్షన్ నెలకొంది. అనర్హత వేటు పడితే తక్షణ కర్తవ్యం ఏంటనే ఆలోచన చేస్తున్నారు. సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో అనర్హత కేసు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే కాంగ్రెస్ లో కొత్త జోష్ రానుంది. కాంగ్రెస్ లోకి మరికొంత మంది ఎమ్మెల్యేలు జంప్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే గులాబీ ఎమ్మెల్యేలు చాలా మంది హస్తానికి టచ్ లో ఉన్నారంటూ మంత్రులు చేసిన వ్యాఖ్యలు నిజం కానున్నాయి. మొత్తంగా నెల రోజుల లోపే వచ్చే అవకాశం ఉండడంతో.. ఇటు పార్టీ మారిన నేతలతో పాటు బీఆర్ఎస్ లోనూ టెన్షన్ నెలకొంది.
స్పాట్ వాయిస్, బ్యూరో
ముగిసిన వాదనలు..
తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
టెన్షన్ లో కడియం, దానం, తెల్లం
వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టుకే..
అనుకులంగా వస్తే కాంగ్రెస్ కు ఊపు..
మరింత మంది చేరే ఛాన్స్
పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాల ఇవ్వగా.. ఉలికిపడిన ఎమ్మెల్యేలు.. డివిజన్ బెంచ్ తీర్పు రిజర్వ్ చేయడంతో మళ్లీ ఏం జరగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఇరువురి తరఫు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరి, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. వీరంతా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరారు. వీరు హస్తం పార్టీలో చేరడంపై పలువురు బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకించారు.వారిపై అనర్హత వేటు వేయాలి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు షెడ్యూల్ ఖరారు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. నెల రోజుల్లో చర్యలు తీసుకోవాలని, ఏం చర్యలు తీసుకున్నారో తమకు తెలపాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది.
డివిజన్ బెంచ్ కు అప్పీల్..
సింగ్ బెంచ్ ఆదేశాలపై అసెంబ్లీ సెక్రటరీ డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. కోర్టులకు స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసే అధికారం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లలో సింగిల్ జడ్జి సరైన ఉత్తర్వులే జారీ చేశారని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది జే ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. న్యాయస్థానం ఇరు వర్గాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసింది.
వ్యతిరేకంగా వస్తే..
కోర్టు తీర్పు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వస్తే వారంతా సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ ముగ్గురే కాకుండా పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ హస్తం గూటికి చేరారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోర్టు తీర్పు ఇస్తే వీరంతా అయోమయంలో పడే అవకాశం ఉంది. ఒక వేళ వీరికి అనుకూలంగా తీర్పు వస్తే మరికొంత మంది బీఆర్ఎస్ పార్టీని వీడే అవకాశం ఉంది. ప్రస్తుతం హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీలో చేరడం సరైంది కాదని ప్రజాస్వామ్య వాదులు చెబుతున్నారు. ఈ పనులు బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఏ పార్టీ చేసినా తప్పేనని వివరిస్తున్నారు. అయినప్పటికీ పార్టీలు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు.
Recent Comments