Thursday, November 21, 2024
Homeటాప్ స్టోరీస్బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

లగచర్ల ఘటన.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
ఇప్పటికే పోలీసుల అదుపులో 57 మంది
స్పాట్ వాయిస్, బ్యూరో: వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓవైపు బీఆర్‌ఎస్ పార్టీ నేతల హస్తం ఈ దాడి వెనుక ఉందనే ఆరోపణలు వినిపిస్తుండగా.. తమపై కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడిలో పాల్గొన్న నిందితుల్లో ఒకరు పట్నం నరేందర్‌ రెడ్డితో ఎక్కువసార్లు ఫోన్లు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. మణికొడలో నివాసం ఉంటున్న సురేశ్​ ఘటన తర్వాత పరారీలో ఉన్నాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డిని విచారించేందుకు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లగచర్ల ఘటనలో 57 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మంగళవారం రాత్రి 16 మందిని రిమాండ్‌కు తరలించారు. మరికొంత మందిని సైతం విచారిస్తున్నారు. సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సూత్రధారుల వ్యవహారంలో కీలక సమాచారం సేకరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments