Thursday, November 14, 2024
Homeజనరల్ న్యూస్టాస్క్ ఓపెన్... రూ.2లక్షలు స్వాహా

టాస్క్ ఓపెన్… రూ.2లక్షలు స్వాహా

జయశంకర్ జిల్లాలో సైబర్‌ మోసం
ప్రైవేట్ ఉద్యోగి అకౌంట్ నుంచి డబ్బులు మాయం
స్పాట్ వాయిస్, రేగొండ: సైబర్‌ మోసాలు రోజురోజుకూ కొత్త రూపంలో జరుగుతూనే ఉన్నాయి. పోలీసుశాఖ, ప్రభుత్వం ఎంత అవగాహన కల్పించినా ఏదో ఒకచోట ప్రజలు సైబర్‌ మోసాల బారిన పడుతూ సర్వం కోల్పోతున్నారు. రేగొండ ఉమ్మడి గోరికొత్తపల్లి మండల కేంద్రంలో వారం రోజుల క్రితం ఓ ప్రైవేట్ ఉద్యిగి సైబర్‌ మోసగాడి వలలో పడి రూ.రెండు లక్షాల పదిహేను వేలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గోరికొత్త పల్లి మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన అజ్మీరా గణేష్ అనే వ్యక్తి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాడు. పది రోజుల క్రితం గుర్తు తెలియని నంబర్ నుంచి హాయ్ ఆదిత్య అంటూ టెలిగ్రామ్ నంబర్ పంపించి జాయిన్ అవమాని మెసేజ్ చేశాడు.ఇలా చేస్తే కొంత అమౌంట్ జమ అవుతుందని చెప్పి వివిధ టాస్కుల నుంచి ఓపెన్ చేయడం ద్వారా 2,15,0000 డబ్బు తన అకౌంట్ నుండి కట్ అయినట్టు తెలిపారు. డబ్బులు మాయం కావడంతో సమీపంలో ఉన్నా రేగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్సై సందీప్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments