Thursday, November 14, 2024
Homeటాప్ స్టోరీస్రేపటి నుంచి కోటగుళ్లలో కార్తీకమాసోత్సవాలు 

రేపటి నుంచి కోటగుళ్లలో కార్తీకమాసోత్సవాలు 

రేపటి నుంచి కోటగుళ్లలో కార్తీకమాసోత్సవాలు 

నవంబర్ 15న కార్తీక దీపోత్సవం 

ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు

పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి

స్పాట్ వాయిస్, గణపురం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్ళలో నవంబర్ 2వ తేదీ నుండి కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 2 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు నెల రోజులపాటు ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమాలలో భాగంగా కార్తీక వన భోజనాలు, గోమాతలకు పూజలు, సత్యనారాయణ వ్రతాలతో పాటు కార్తీకదీపం కార్యక్రమం నవంబర్ 15న కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. దీపోత్సవం సందర్భంగా సుమారు 10 వేల మట్టి ప్రమిదలతో ఆలయాన్ని అలంకరించనున్నారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమ, శుక్రవారంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించనున్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు, దీపోత్సవానికి నూనెను అందించేవారు ఆలయ పరిరక్షణ కమిటీ నాగపూరి శ్రీనివాస్ గౌడ్, ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు 9949749675, 9100512458 నెంబర్లను సంప్రదించాలన్నారు. నూనెను అందించే భక్తుల నామ గోత్రాలపై ప్రతిరోజూ సాయంత్రం పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పరిరక్షణ కమిటీ తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments