Thursday, November 14, 2024
Homeజిల్లా వార్తలుపెద్దమ్మతల్లిని దర్శించుకున్న మెపా బాధ్యులు

పెద్దమ్మతల్లిని దర్శించుకున్న మెపా బాధ్యులు

పెద్దమ్మతల్లిని దర్శించుకున్న మెపా బాధ్యులు

– పెద్దమ్మ తల్లి బయటపడిన చోట ప్రభుత్వమే గుడి నిర్మాణం చేపట్టాలి 

– మెపా రాష్ట్ర కమిటీ డిమాండ్

స్పాట్ వాయిస్, వరంగల్ : వరంగల్ నగరం లోని ములుగు క్రాస్ రోడ్డు ఏరియా లో తవ్వకాల్లో పెద్దమ్మ తల్లి దేవత విగ్రహం బయట పడిన చోట ఆలయాన్ని నిర్మించాలని మెపా (ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసిందిర.ఈ మేరకు మెపా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ తో పాటు రాష్ట్ర ,జిల్లా కమిటీ బాద్యులు పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని దర్శించుకొని పూజలు చేసారు. పెద్దమ్మ తల్లి ముదిరాజ్ కుల దైవమని తెలిపారు. ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం, దేవదాయ శాఖ అధికారులు చొరవ చూపాలని కోరారు. పురాతన కాలంలో ఆ ప్రాంతం లో పెద్దమ్మ తల్లి ఆలయం ఉండటం వల్లనే ఆ ప్రాంతానికి పెద్దమ్మ గడ్డ అని పేరు వచ్చిందని తెలిపారు. కావున ఎంతో చరిత్ర కలిగిన పెద్దమ్మ గడ్డ ప్రాంతం లో పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మించి నిత్యం పూజలు జరిగేలా చూడాలని కోరారు. పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని దర్శించుకున్న వారిలో రాష్ట్ర నాయకులు నీరటి రాజు,దండు చిరంజీవి , సింగారపు రామ కృష్ణ,బోనాల రమేష్, హనుమకొండ, వరంగల్ జిల్లాల ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ,అమ్మ గారి శ్యామ్ లతో పాటు ముదిరాజ్ కుల బందువులు గోనెల మహేందర్,అనురాధ ముదిరాజ్,గోవర్ధన్,పులి సుధాకర్,స్వరూప, శీలం సంద్య, సంగినేని వనమాల , సమత ముదిరాజ్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments