Saturday, November 23, 2024
Homeటాప్ స్టోరీస్నేను డీఎస్పీని..

నేను డీఎస్పీని..

మీ ల్యాండ్ లొల్లి సెటిల్ చేస్తా..
బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ నిర్వాకం
కేసు నమోదు చేసిన పోలీసులు
స్పాట్ వాయిస్, కాజీపేట: నేను డీఎస్పీ నంటూ మోసాలకు పాల్పడడమే కాకుండా.. ల్యాండ్ సెటిల్ మెంట్లు చేస్తున్నాడో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్. వివరాల్లోకి వెళ్తే.. మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన భూపతి హరీష్, అతని బాబాయ్ అయినా భూపతి. సురేష్, రమేష్, శ్రీనివాస్ కు కొంతకాలంగా భూ సమస్య ఉంది. ఈ క్రమంలో మడికొండ పోలీసులను ఆశ్రయించగా సివిల్ తగదగా చెప్పి వారిని కోర్టుకు వెళ్లమన్నారు. ఈ క్రమంలో భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం, నవాబుపేట గ్రామానికి చెందిన కొక్కుల పూర్ణచందర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన భూపతి రమేష్, సురేష్, శ్రీనివాసులను తనకు తాను పరిచయం చేసుకున్నాడు. తాను డీఎస్పీని అని, ఉన్నతాధికారులు అందరు తెలుసంటూ నమ్మబలికాడు. మీ భూ సమస్యను సెట్ చేస్తా అని చెప్పి 22.10.2024 రోజున భూపతి హరీష్ ను, అతని మిత్రుడు మారినేని రోహిత్ ను పూర్ణచందర్ వారి ల్యాండ్ ఇష్యూ సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరించాడు. ఈ విషయమై భూపతి హరీష్ దరఖాస్తు మేరకు మడికొండ ఇన్ స్పెక్టర్ పి. కిషన్ పలు సెక్షన్ల కింద కొక్కుల పూర్ణచందర్ పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మడికొండ ఇన్ స్పెక్టర్ మాట్లాడుతూ.. ఎవరైనా పోలీసుల పేరు గాని, పోలీసు ఉన్నతాధికారుల పేర్లు చెప్పి గాని ల్యాండ్ సెటిల్మెంట్స్, పంచాయితీలు చేస్తమంటే నమ్మొదని, బాధితులను మోసం చేస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments