Tuesday, December 3, 2024
Homeలేటెస్ట్ న్యూస్జయశంకర్ జిల్లాలో కారు బీభత్సం... 

జయశంకర్ జిల్లాలో కారు బీభత్సం… 

కారు బీభత్సం… 

దంపతులకు తీవ్ర గాయాలు

మండల కేంద్రంలో ఘటన

స్పాట్ వాయిస్, గణపురం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం ఆంద్రా బ్యాంకు సమీపంలో బైక్ పైకి కారు వేగంగా దూసుకెళ్లి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన భరత్, లాస్యా అనే దంపతు ల కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనలో కారు బైక్ ను ఢీ కొని కిలో మీటర్ వరకు వెళ్లి బోల్తాపడింది.

కారులో ఉన్న చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన బండి సంజయ్ అనే వ్యక్తి మండల కేంద్రంలో జరగిన ఓ ఫంక్షన్ కు హాజరై తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా కారులో ఉన్న వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. క్షతగాత్రులైన దంపతులిద్దరిని 108 వాహనంలో భూపాలపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. లాస్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments