Wednesday, April 16, 2025
Homeతెలంగాణమినీ మేడారం తేదీలు ఫిక్స్..

మినీ మేడారం తేదీలు ఫిక్స్..

ఫిబ్రవరి 12 నుంచి 15వరకు నిర్వహణ
స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మినీ జాతర తేదీలను సమ్మక్క-సారలమ్మ ఆలయ పూజారుల సంఘం ప్రకటించింది. మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అధ్యక్షతన శనివారం సమ్మక్క సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజు పూజారుల సమక్షంలో జరిగిన సమావేశంలో మినీ మేడారం జాతరకు తేదీలు ఖరారు చేశారు. 2025 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు మినీ జాతర నిర్వహించాలని నిర్ణయించినట్లు పూజారులు తెలిపారు. నాలుగు రోజల పాటు జరిగే మినీ జాతర సందర్భంగా భక్తులకు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలని సూచించారు. కాగా, భక్తుల  సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments