Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలుఘనంగా పద్మశాలి ఉద్యోగుల ఆత్మీయ అభినందన సభ

ఘనంగా పద్మశాలి ఉద్యోగుల ఆత్మీయ అభినందన సభ

ఘనంగా పద్మశాలి ఉద్యోగుల ఆత్మీయ అభినందన సభ
స్పాట్ వాయిస్, సుబేదారి : తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం (టీపీయూఎస్) ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండ జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఆత్మీయ అభినందన సభ ను నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ పద్మశాలి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కోడం రవిప్రకాష్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు, ఉమ్మడి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుండు ప్రభాకర్, అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి మార్గం ధర్మదేవ్, వరంగల్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, హన్మకొండ కలెక్టరేట్ ఏవో, సంఘం సహధ్యక్షుడు కుసుమ సత్యనారాయణ, వరంగల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గుర్రపు వీరస్వామి, విద్యుత్ శాఖ సీజీఎం, ఇంచార్జి డైరెక్టర్ మధుసూదన్, మ్యారేజ్ బ్యూరో కన్వీనర్, స్టేట్ ట్రెజరర్ లకుం నవీన్ రాజకుమార్, దక్షిణ మధ్య రైల్వే యూనియన్ నాయకుడు దేవులపల్లి రాఘవేందర్, ఉపాధ్యక్షుడు, వెటర్నరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బింగి సురేష్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ వంగరి సూర్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి కొండబత్తుల రాజమౌళి, రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షులు పిట్ట ఉమాదేవి, డిప్యూటీ డైరెక్టర్ వెటర్నరీ శాఖ పంతగాని శ్రీనివాస్, అల్ ఇండియా పోస్టల్ యూనియన్ నాయకుడుబొద్దున వెంకటేశ్వర్లు , జిల్లా కోశాధికారి ఆడెపు నాగరాజు, జిల్లా సంఘ కార్యవర్గ సభ్యుడు గుర్రపు రాజమౌళి, కూచన రాజు, సిరిమల్లె లింగమూర్తి, చిందం లింగమూర్తి దేవులపల్లి సాయిరాజ్, బూర రజిత, మాచార్ల శివప్రసాద్గారు, గుర్రపు మధుమోహన్, కుడికాల సత్యనారాయణ, కందగట్ల రామాకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2024పంద్రాగస్టు సందర్భంగా ఉత్తమ ఉద్యోగులుగా అవార్డు పొందిన వారిని, ఇటీవల పదోన్నతులు పొందిన వారిని, పదవీ విరమణ చేసిన పద్మశాలి ఉద్యోగులను, పద్మశాలీ జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. మొదట సభ అధ్యక్షుడు కోడం రవిప్రకాష్ ఉమ్మడి జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి సవివరంగా తెలిపారు. టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు సంఘం రాష్ట్ర స్థాయిలో చేస్తున్న పద్మశాలి కులబాంధవులకు, పేద పద్మశాలి విద్యార్థులకు చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరంచారు. ఆపదలో ఉన్న పేద పద్మశాలి విద్యార్థుల వివరాలు పంపిస్తే తప్పకుండా వారిని ఆదుకుంటామని తెలిపారు. గుండు ప్రభాకర్ మాట్లాడుతూ పద్మశాలి ఉద్యోగులంతా ఐక్యతగా ఉండాలని కోరారు. వేముల నాగరాజు మాట్లాడుతూ పద్మశాలి ఉద్యోగులు వివిధ ఉద్యోగ సంఘాల్లో రాణిస్తున్నారని, రాజకీయ అధికారం కోసం ప్రయత్నం చేస్తున్న పద్మశాలి కులబంధావులకు అండగా ఉండాలని కోరారు. వరంగల్ జిల్లా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గుర్రం వీరస్వామి పద్మశాలి ఉద్యోగుల పనితీరును అభినందించారు. కుసుమ సత్యనారాయణ మాట్లాడుతూ రెవెన్యూ విభాగంలో పద్మశాలి కులస్తులకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తామని తెలిపారు. విద్యుత్ శాఖ సీజీఎం మధుసూదన్ మాట్లాడుతూ కులబాంధవులంతా ఐక్యంగా ఉండి పరస్పర సహాయ సహకారాలను అందించుకోవాలన్నారు. గడ్డం కేశవ మూర్తి మాట్లాడుతూ పద్మశాలీ లు అన్ని రంగాల్లో రాణించాలని, అందుకు పద్మశాలీలు ఐక్యతగా ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన పద్మశాలి ఉద్యోగులు, పత్రికా విలేకరులు, పద్మశాలి కుల బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments