పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి
సీఐ, ఎస్సైని సస్పెండ్ చేయాలని మృతుడి సెల్ఫీ వీడియో
స్పాట్ వాయిస్ , తొర్రూరు: పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నిoచిన లకావత్ శ్రీను (24) ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. శ్రీను మృతి చెందే ముందు సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. సీఐ మహేందర్ రెడ్డి, ఎస్సై సాయి ప్రసన్న కుమార్ ని వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. శ్రీను ఆఖరిగా తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. సీఐ,ఎస్ఐతో పాటు మరో ఆరుగురిని కఠినంగా శిక్షించాలని శ్రీను సెల్ఫీ వీడియోలో కోరాడు. శ్రీను మృతి తో తండాలో విషాదఛాయలు అలుమకున్నాయి.
Recent Comments