Saturday, April 5, 2025
Homeటాప్ స్టోరీస్జైల్లో రామాయణ నాటక ప్రదర్శన..

జైల్లో రామాయణ నాటక ప్రదర్శన..

వానరుల వేషం వేసిన ఖైదీలు..
సీతను వెతికేందుకు వెళ్తూ పరార్
స్పాట్ వాయిస్, బ్యూరో: దసరా సందర్భంగా జైలులో రామాయణం నాటకం వేయగా, వానరుల వేషం వేసిన ఇద్దరు ఖైదీలు గోడదూకి పారిపోయారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని రోషనాబాద్‌ జైలులో జరిగింది. జైలులో దసరా సందర్భంగా రామాయణం నాటకం వేశారు. అందులో పంకజ్‌, రాజ్‌ కుమార్‌ అనే ఖైదీలు వానరుల వేషం వేశారు. నాటకంలో భాగంగా వారు సీతను వెతుకుతూ వెళ్లి పోలీసులు, తోటి ఖైదీలు చూస్తుండగానే నిచ్చెన వేసుకుని 22అడుగుల గోడ దూకి పారిపోయారు. పోలీసులు వెంటనే వారి కోసం గాలింపు చేపట్టారు. పంకజ్‌ ఓ హత్య కేసులో జీవిత ఖైదు, రాజ్‌ కుమార్‌ ఓ కిడ్నాప్‌ కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. జైలర్‌ ప్యారేలాల్‌ సహా ఆరుగురు జైలు అధికారులను సస్పెండ్‌ చేశారు. పంకజ్‌, రాజ్‌కుమార్‌తో పాటు చోటు అనే మరో ఖైదీ పారిపోయేందుకు ప్రయత్నించాడని, కాని నిచ్చెన కూలిపోవడంతో అతని ప్రయత్నం విఫలమైందని అధికారులు తెలిపారు. ఈ ముగ్గురు పారిపోయేందుకు వారంక్రితమే ప్రణాళిక చేసుకోవడం గమనార్హం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments