Saturday, November 23, 2024
Homeజిల్లా వార్తలుకొత్త వారికి ఒక న్యాయం  పాత వారికి ఒక న్యాయమా?

కొత్త వారికి ఒక న్యాయం  పాత వారికి ఒక న్యాయమా?

కొత్త వారికి ఒక న్యాయం 

పాత వారికి ఒక న్యాయమా?

 317 జీఓ బాధితులకు న్యాయం చేశాకే కొత్త టీచర్ల కు పోస్టింగ్ లు ఇవ్వాలి

– పీఆర్ టి యూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ డిమాండ్

 

స్పాట్ వాయిస్ , బ్యూరో: 317 అనే జీఓ తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులకు గత ప్రభుత్వం తీవ్ర నష్టం కలిగించిందని ఆ జీఓని రద్దు పరచి, అందరికీ న్యాయం చేస్తానని నూతన ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. ఆ జీవో రద్దు కోసం కమిటీలతో కాలయాపనం చేస్తూ ఇప్పటివరకు సాగదీసి, ఇప్పుడు ఆ జీవోను రద్దు పరచకుండా , ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో నూతన ఉపాధ్యాయులకు కొత్త జిల్లాల ప్రకారం పోస్టింగులు ఇస్తూ..గతంలో నుండి పోరాటాలు చేస్తున్న వారిని ఉమ్మడి జిల్లాల్లోనే ఉంచడం ఎంతవరకు న్యాయం ఆలోచించాలి!. ఇప్పుడైనా 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేశాకే కొత్త వారికి పోస్టింగ్ ఇవ్వాలని, లేనిపక్షంలో ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కలిసి ఐక్య పోరాటాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని పీఆర్ టియూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments