Thursday, November 14, 2024
Homeతెలంగాణవరంగల్ లో ఎమ్మెల్యేల రహస్య సమావేశం..

వరంగల్ లో ఎమ్మెల్యేల రహస్య సమావేశం..

ఊకునేదే లే..!?
కొండా ఆగడాలకు చెక్ పెట్టుడే..
మంత్రి కొండా సురేఖపై ఫిర్యాదుకు రెడీ..!
సీఎంను కలిసేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలు
ఆదివారం రాత్రి రహస్య సమావేశం..!
ప్రభావిత ఎమ్మెల్యేల హాజరు..
భవిష్యత్ కష్టమేనంటూ ఆవేదన
ఒకరిని మించి ఒకరు కంప్లైట్ చేసినట్లు సమాచారం..
ఒకటి రెండు రోజుల్లో సీఎం వద్దకు..
వరుస వివాదాల్లో కొండా సురేఖ..

మంత్రి కొండా సురేఖ తీరును ఏమాత్రం భరించేది లేదని, సీఎం దృష్టికి తీసుకెళ్లి తాడోపేడో తెల్చుకునేందుకు పలువురు ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆదివారం రాత్రి నలుగురు ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు సమావేశమై తీవ్ర స్థాయిలో చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం వద్దకు మూకుమ్మడిగా వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ తీరుతో తమతమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లో వర్గపోరు వస్తోందని.. ఇదే కొనసాగితే భవిష్యత్ కష్టమేననే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు రెడీ అయినట్లు సమాచారం. రహస్య సమావేశంలో 10నెలలుగా మంత్రి కొండా సురేఖ, ఆమె అనుచరులతో తమతమ నియోజకవర్గాల్లో జరిగిన ప్రతిఘటనపూ చర్చించినట్లు తెలిసింది. ఇక మంత్రి కొండా సురేఖ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవలే అక్కినేని నాగార్జున ఇష్యూలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. తాజాగా పరకాల నియోజకవర్గంలో జరిగిన ఘటనలో తలదూర్చి మరింత రచ్చ చేసుకున్నారు. ఇప్పటికే కొండాపై చర్యలుంటాయనే వార్తలు గుప్పుమంటుండగా.. తాజా ఘటన మంత్రిని మరింత ఇరకాటంలో పడేశాయి. ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తే మరి సీఎం ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
స్పాట్ వాయిస్, ఓరుగల్లు

 మంత్రి కొండా సురేఖ తీరు అటు రాష్ట్రం, ఇటు సొంత జిల్లాలో వివాదస్పదంగా మారింది. సొంత పార్టీ నేతలతోనే కయ్యానికి సై అనడం కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా మంత్రి కొండా సురేఖ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ప్రసుత్తం మంత్రి ప్రవర్తన మాత్రం ఇటు పార్టీకి, అటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, పార్టీలో ఆమె వ్యవహారశైలి గ్రూప్ రాజకీయాలకు తావిస్తోందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒక మంత్రిగా ఉండి ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏంటనేదే.. ఎవరికీ అర్థంకావడం లేదు. దీంతో ఈ అమాత్యురాలిపై హైకమాండ్‌ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.

అక్కినేని ఫ్యామిలీ వివాదంలో..
ఇటీవల కేటీఆర్ ను ఇరుకున పెట్టాలనే ఆలోచనతో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. హీరో అక్కినేని నాగార్జున కుటుంబంపై ఆమె చేసిన కామెంట్స్‌ ఇటు రాజకీయాల్లోనూ, అటు సినిమారంగంలోనూ పెద్ద సునామీనే సృష్టించాయి. అయితే కొండా సురేఖ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నా.. ఈ వివాదం సద్దుమణగలేదు. దీంతో, అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి.. ఈ మహిళా మంత్రి విషయంలో మింగలేక కక్కలేక అన్నట్టుగా తయారైంది.

రేవూరి ప్రకాష్‌రెడ్డి వర్సెస్ కొండా సురేఖ
అక్కినేని ఫ్యామిలీ ఇష్యూతో రాష్ట్రంలోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మంత్రి కొండా సురేఖ.. తాజాగా సొంత జిల్లాలో తీవ్ర దుమారంరేపారు. సొంత జిల్లాలో, సొంత పార్టీలో ఆమె వ్యవహార శైలి మరో తీవ్ర చర్చగా మారింది. ఉప్పు, నిప్పులా ఉంటున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య దసరా పండగరోజు స్థానికంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ మరోసారి రగడకు కారణమైంది. ఫ్లెక్సీలో కొండా సురేఖ ఫొటో లేదంటూ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి ఫ్లెక్సీలను ఆమె అనుచరులు చింపేశారు. దీంతో, రేవూరి ప్రకాష్ రెడ్డి. కొండా సురేఖల మధ్య గొడవ మరోసారి పీక్స్‌కు చేరింది. గీసుకొండ పోలీస్ స్టేషన్‌లో సురేఖ అనుచరులపై.. రేవూరి ఫాలోవర్స్‌.. కేసు కూడా పెట్టారు. ఇక్కడిదాకా వ్యవహారం చూస్తే.. ఇదంతా కాంగ్రెస్‌లో షరా మామూలే అనుకోవచ్చు. కానీ, ఆ తర్వాత కొండా సురేఖ వ్యవహరించిన తీరే.. పెద్ద రచ్చకు దారితీసింది.
ఎమ్మెల్యేల రహస్య భేటీ..?!

ప్రత్యర్థులతోనే కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనూ కొండా సురేఖ ఢీ అంటే ఢీ అంటున్నారు. రేవూరితో ఆమె జగడం కారణంగా.. వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఈక్రమంలోనే ఆదివారం రాత్రి నలుగురు ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షురాలు సమావేశమై కొండా సురేఖ తీరుపై చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ వర్సెస్ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. దీనికి తోడు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యను బహిరంగగానే విమర్శించారు. అలాగే వరంగల్ జిల్లా అధ్యక్షురాలితోనూ అంతగా సఖ్యత లేదనేది బహిరంగ రహస్యమే. ఇక పశ్చిమ, భూపాలపల్లి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోనూ కొండా సురేఖ తన బలాన్ని చూపే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన గీసుగొండ ఘటన పలువురు ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడానికి పురిగొల్పింది. మంత్రి కొండా సురేఖ తీరును ఏమాత్రం భరించేది లేదని, సీఎం వద్దకు మూకుమ్మడిగా వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ తీరుతో తమతమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లో వర్గపోరు వస్తోందనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే కొండా ఇష్యూపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించి ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే రహస్య భేటి క్రమంలో మంత్రి విషయంలో పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments