మాజీ ఎమ్మెల్సీ మురళీధర్ రావు
కొండాకు కాశీబుగ్గ దసరా ఉత్సవ సమితి సన్మానం
స్పాట్ వాయిస్, వరంగల్ సిటీ : కాశీబుగ్గ దసరా ఉత్సవ విజయవంతానికి తాను సహకరిస్తానని మాజీ ఎమ్మెల్సీ మురళీధర్ రావు హామీ ఇచ్చారు. ఆదివారం కాశీబుగ్గ దసరా ఉత్సవ సమితి అధ్యక్షుడు దూపం సంపత్, ప్రధాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్, కన్వీనర్ బయ్య స్వామి, 19వ డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణ లత భాస్కర్ ల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. దసరా ఉత్సవాల నిర్వహణకు సహకరించాలని వినతి పత్రం అందజేసిన ఉత్సవ సమితి కొండాకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ చిన్న వడ్డేపల్లి (పద్మనగర్) చెరువు ప్రాంతంలో నిర్వహిస్తున్న బతుకమ్మ, రావణాసురవధ, దసరావేడుకలు చాలా కనువిందుగా జరుగుతాయని, ఉత్సవ సమితి కోరిక మేరకు ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల విషయమై మున్సిపల్ కమిషనర్ కి ఫోన్ చేసి మాట్లాడారు. బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఉర్సు రంగలీలా మైదానం లాగా చిన్నవడ్డేపల్లిలో కూడా ఏర్పాట్లు చేయాలని, పనులు వేగవంతం చేసేలా సహకరించాలని కమిషనర్ ను కోరారు. కాశీబుగ్గ దసరా ఉత్సవ సమితికి పూర్తి సహాయ సహకారం అందించి కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడుతానని తెలిపారు. కొండాను కలిసిన వారిలో
వర్కింగ్ ప్రిసెండెంట్ గుల్లపల్లి రాజ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్, చిలువేరు శ్రీనివాస్, రాచర్ల శ్రీనివాస్, గోరంట్ల మనోహర్, మీసాల ప్రకాష్, సిద్దూజు శ్రీనివాస్, ఎరుకల రఘునారెడ్డి, దాసరి రాజేష్, అంబి సాంబరాజు, ఓం ప్రకాష్ కొలారియా, సిలువేరు థామస్, కూచన రవీందర్, గుర్రపు సత్యనారాయణ, ములుక సురేష్, రామ యాదగిరి, సింధం చంద్రశేఖర్, ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
దసరా ఉత్సవ విజయవంతానికి సహకరిస్తా..
RELATED ARTICLES
Recent Comments