Thursday, November 21, 2024
Homeతెలంగాణమళ్లీ అవే వ్యాఖ్యలు..

మళ్లీ అవే వ్యాఖ్యలు..

మంత్రి కొండా మళ్లీ ఘాటు వ్యాఖ్యలు
స్పాట్ వాయిస్, బ్యూరో: అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తెలంగాణ రాజకీయాలతో పాటు టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతుండగా.. మళ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగార్జున, నాగచైతన్య కలిసి సమంతపై ఒత్తిడి తీసుకొచ్చారని.. అది నచ్చకే ఆమె విడాకులు తీసుకుందంటూ కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేయటం సర్వత్రా సంచలనంగా మారింది. అయితే.. ఈ విషయంపై అటు టాలీవుడ్ ప్రముఖులంతా విరుచుకుపడుతుండగా.. అటు బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ పరిణమాలతో.. కాస్త వెనక్కి తగ్గిన కొండా సురేఖ.. కేవలం సమంత పేరును ప్రస్తావిస్తూ ట్వీట్ చేసింది. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా అంటూ అందులో పేర్కొన్న కొండా.. మరోసారి అక్కినేని ఫ్యామిలీపై ఘాటు ఆరోపణలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి కొండా సురేఖ.. మరోసారి నాగచైతన్య, సమంత విడాకుల విషయాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “పోనీ సరే.. వారి విడాకులపై నేను చెప్పింది తప్పే. మరి ఇప్పటివరకు నాగచైతన్యకు, సమంతకు ఎందుకు విడాకులయ్యాయన్న విషయం ప్రపంచానికి తెలుసా. తెలువదు కదా. నాగార్జున ఫ్యామిలీ నుంచైనా ఏమైనా చెప్పారా..? ఆ అమ్మాయి ఎలాగూ చెప్పుకోలేదు. మాకు ఇండస్ట్రీ నుంచి ఇంటర్‌నల్‌గా తెలిసిన సమాచారం. ఈరోజు నాకు కోపం వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడాను. మాట్లాడతాను కూడా. నేను ఎలాంటి దాపరికాలు లేకుండా మాట్లాడతాను అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక ముందు కూడా అలాగే మాట్లాడతాను. కేటీఆర్ ఇదే చెప్తున్నా. ఈరోజు నుంచి నువ్వు జిల్లాల్లో తిరగవు. హైదరాబాద్‌లో కూడా తిరగలేవు. ఇంటి నుంచి బయటకు రావు.” అంటూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments