Saturday, April 5, 2025
Homeలేటెస్ట్ న్యూస్షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి..

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి..

హీరోయిన్ కు తప్పిన ప్రమాదం..
తొర్రూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలు
స్పాట్ వాయిస్, తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో స్టేజ్‌ ఒక్కసారిగా కుప్పకూలడంతో పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సినీనటి ప్రియాంక మోహన్, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదిక పైకెక్కి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో సినీనటి ప్రియాంక మోహన్ సురక్షితంగా బయటపడగా.. ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయలవడంతో వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments