ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం..
స్పాట్ వాయిస్, క్రైం: ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం సాయంత్రం ఉరుములు మెరుపులు వచ్చి వర్షం పడింది. అయితే పిడుగులు పడడంతో హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో ఇద్దరు మహిళ కూలీలు మృతి చెందారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రగయ్యపల్లిలో వ్యవసాయ కూలీ పిడుగుపాటుతో కుప్పకూలిపోయింది. చౌల్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు కూలీలు ఇటకాల నిర్మల, సోలంక రమ వ్యవసాయ పనులకు వెళ్లి వస్తుండగా.. కల్లు మండువ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిర్మల, రమ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రంగయ్యపల్లికి చెందిన లక్ష్మి భర్తతో కలిసి వ్యవసాయ భూమిలో మిరప తోటకు పిండి చల్లుతుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు వచ్చి వర్షం రావడంతో పిడుగుపాటుకు గురైంది.
Recent Comments