జయశంకర్ జిల్లాలో విషాద ఘటన
స్పాట్ వాయిస్, రేగొండ: వ్యవసాయ బావి వద్ద పనులు చేస్తున్న ఓ మహిళ రైతుపై పిడుగు పడి మృతి చెందిన ఘటన రేగొండ మండలం రంగయ్యపల్లిలో గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కరట్లపల్లి లక్ష్మి (45) భర్త నగేష్ తో కలిసి తనకున్న వ్యవసాయ భూమిలో మిరప తోటకు పిండి చల్లుతుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు వచ్చి వర్షం రావడంతో పిడుగుపాటుకు గురైంది. లక్ష్మి దగ్గరలో పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆమె భర్త నగేష్ తెలిపాడు. మృతురాలి మెడలో ఉన్న పుస్తెలతాడు ముక్కలై పిడుగు పడినప్పుడు వచ్చిన వేడితో కరిగిపోయినట్లు స్థానికులు గుర్తించారు. మృతురాలికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. పిడుగుపాటుకు గురై మహిళ రైతు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు పలుముకున్నాయి. మృతి చెందిన మహిళ రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. పిడుగుపాటుతో మహిళ మృతి చెందిన విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హుటాహుటినా రంగయ్యపల్లికి చేరుకొని.. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరఫున అన్నివిధాలా సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
Recent Comments