Saturday, November 16, 2024
Homeజిల్లా వార్తలుప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

 దామెర ఎస్సై కొంక అశోక్..

స్పాట్ వాయిస్ దామెర: దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మ ఆడే క్రమంలో చైన్ దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కొంక అశోక్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ, దసరా పండుగ సెలవులు, బతుకమ్మలు ఆడటం కోసం మహిళలు అందరూ పెద్ద ఎత్తున ఒకచోట చేరిన క్రమంలోచైన్ దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున మహిళలు ధరించిన నగలపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.పండుగ సెలవుల్లో బందువుల ఊళ్లకు పోయేవారు ఇంటిలో విలువైన వస్తువులు,బంగారం,నగదు ఇంట్లో ఉంచి వెళ్ళవద్దన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, రద్దీగా ఉండే ఏరియాలలో నేరాలు జరిగే అవకాశం ఉన్నందున, ప్రయాణాలలో విలువైన వస్తువుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే 100 కు కాల్ చేయాలని, అలాగే సీసీ కెమెరాలు కూడా అమర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి దొంగలు వచ్చి దొంగతనాలు చేసి వెళ్తున్నారని, రద్దీ ఉన్న స్థలాలలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, పిల్లల్ని,విలువైన వస్తువులను జాగ్రత్త చూసుకోవలన్నారు. ఏలాంటి సమస్యలు ఉన్న ప్రజలు ఈ ఫోన్ నంబర్లకు 87126 85228,87126 85020 కాల్ చేయాలని ఎస్సై కొంక అశోక్ తెలిపారు…

RELATED ARTICLES

Most Popular

Recent Comments