కేయూలో విజిలెన్స్ దాడులు
మాజీ రమేష్ అక్రమాలపై అడిగిన సమాచారం పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడంతో స్వయంగా యూనివర్సిటీ కే వచ్చిన విజిలెన్స్ బృందం..
విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీఎస్పీ బాలు, సీఐ రాకేష్ ఆధ్వర్యంలో సోదాలు
ఫేక్ ప్రాజెక్టులు, అక్రమ నియామకాలు, న్యాక్ పనులకు సంబంధించిన ఫైళ్లను ఇవ్వకపోవడంతో
కేయూ ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం
అందుబాటులో లేని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి
ఇన్ చార్జీ వీసీని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ తాటికొండ రమేష్ అక్రమాలపై అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ (AKUT) బాధ్యులు ప్రభుత్వానికి, విజిలెన్స్ అధికారులకు వేరు వేరుగా ఇచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం స్పందించి విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏ.ఎస్.పీ బాలు కోటి, సీ.ఐ రాకేష్ మరియు ఇతర విజిలెన్స్ అధికారుల బృందం కేయూ పాలన భవనం చేరుకొని విచారణ జరుపుతున్నారు. ప్రస్తుత ఇన్చార్జి రిజిస్ట్రార్ నరసింహ చారీ, వర్సిటీ అడిట్, స్టేట్ లోకల్ ఆడిట్ వారిని రిజిస్ట్రార్ ఛాంబర్ కు పిలిపించుకొని అన్ని ఫైల్స్ గురుంచి ఆరా తీస్తున్నట్లు సమాచారం.
*మాజీ వీసీ రమేష్ సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ పై ఆరా?*
గతంలో నాలుగు సార్లు విజిలెన్స్ అధికారులు వర్సిటీ రిజిస్ట్రార్ కు నోటీసులు ఇచ్చినా కూడా వాటికి సంబంధిత ఫైల్స్ ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించినట్లు సమాచారం. సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ కు సంబంధించిన సెలెక్షన్ కమిటీ ప్రొసీడింగ్స్, ఈసీ మినట్స్ గురుంచి ఇన్చార్జి రిజిస్ట్రార్ ను ప్రశ్నించినట్లు తెలిసింది. ఫార్మసీ, ఇంజనీరింగ్ లలో జరిగిన పీ.ఎచ్.డీ అక్రమాలపై కూడా సమాచారం అడిగినట్టు సమాచారం. పీ.ఎచ్.డీ అడ్మిషన్లు చేసిన డీన్ లను పిలిపించి ప్రశ్నించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. పాత సర్వీసు ను అక్రమంగా కలుపుకొని రిజిస్ట్రార్ ఆర్డర్ ద్వారా ప్రమోషన్లు పొందుతున్న వారితో బాటు పాత పెన్షన్ విధానలోకి మారిన వారి గురుంచి ఆరా తీస్తున్నట్లు సమాచారం.
* మాజీ రమేష్ అక్రమాలపై అడిగిన సమాచారం పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడంతో స్వయంగా యూనివర్సిటీ కే వచ్చిన విజిలెన్స్ బృందం..
* విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్. అడిషనల్. ఏఎస్పీ. బాలకోటి ఆధ్వర్యంలో సోదాలు
* ఫేక్ ప్రాజెక్టులు, అక్రమ నియామకాలు, న్యాక్ పనులకు సంబంధించిన ఫైళ్లను ఇవ్వకపోవడంతో
* కేయూ ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం
*అందుబాటులో లేని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి
* ఇన్ చార్జీ వీసీని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం
Recent Comments