Monday, September 30, 2024
Homeజిల్లా వార్తలుఉత్తమ ప్రతిభ కనబర్చిన టెన్త్ విద్యార్థులకు ప్రతిభా అవార్డులు

ఉత్తమ ప్రతిభ కనబర్చిన టెన్త్ విద్యార్థులకు ప్రతిభా అవార్డులు

ఉత్తమ ప్రతిభ కనబర్చిన టెన్త్ విద్యార్థులకు ప్రతిభా అవార్డులు
పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో సన్మానం
స్పాట్ వాయిస్, చిట్యాల: చిట్యాల మండల పరిధిలో 2023 -24లో పదో తరగతి ఫలితాలలో ఉత్తమ జీపీఏ సాధించిన వివిధ పాఠశాలల విద్యార్థులకు పీఆర్టీయూ టీఎస్ చిట్యాల మండల శాఖ ఆధ్వర్యంలో.. జూకల్ ఉన్నత పాఠశాలలో ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించినట్లు సంఘం చిట్యాల మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రతిభ అవార్డుల కార్యక్రమానికి స్పాన్సర్ గా చిట్యాల మండలం బాబు సింగ్ పల్లికి చెందిన దివంగత అజ్మీర సమ్మయ్య (రిటైర్డ్ ఉపాధ్యాయుడు) కుమారులు డా.అజ్మీరా రామ్ కిషన్, డిప్యూటీ కంట్రోల్ ఆఫ్ డ్రగ్స్ ఆఫ్ ఇండియా వ్యవహరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ కిషన్ మాట్లాడుతూ.. చిట్యాల మండలంలోని బాబు సింగ్ పల్లె, తమ స్వగ్రామం అని ,తన తండ్రి సమ్మయ్య రిటైర్డ్ టీచర్, పీఆర్టీయూ టీఎస్ సభ్యుని జ్ఞాపకార్థం ఈ ప్రతిభ అవార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. తాను జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఒక బంజారా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అయినా స్వశక్తితో, గురువుల నేర్పిన విద్యతో డ్రగ్స్ కంట్రోలర్ డిప్యూటీ ఆఫ్ ఇండియాగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నానని చెప్పారు. విద్యార్థులు విజయం సాధించాలంటే క్రమశిక్షణ , కఠోర శ్రమ, అంకితభావం, విలువలు వీటితోటే విజయం సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మరొక విశిష్ట అతిథులు జిల్లా పీఆర్టీయూ టీఎస్ భూపాలపల్లి జిల్లా జనరల్ సెక్రెటరీ కుసునపు కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. డాక్టర్ రామ్ కిషన్ జీవితం ఆదర్శప్రాయం ఆచరణీయం అని మాట్లాడారు. రాబోయే కాలంలో జిల్లాలోని మండలాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులను అందజేసే కార్యక్రమాలను రూపొందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. చిట్యాల మండలంలో ఇటీవల పదోన్నతి పై వచ్చిన ఉపాధ్యాయులకు కూడా ఇదే వేదికపై సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పదోన్నతిపై మండలానికి హాజరైన ఉపాధ్యాయులందరికీ ముఖ్య అతిథిగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న వివిధ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఝాన్సీ రెడ్డి, ఊర్మిళరెడ్డి, గిరగాని కృష్ణ సుమలత, పీఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి సుదం సాంబమూర్తి, లింగయ్య, పావని, చిలకమారి సదానందం, విజయశాంతి, బండి ప్రసాద్, పంచిక భగవాన్ రెడ్డి, హరి ప్రసాద్, బండి ప్రసాద్, పున్నం రవీందర్, విజయసాగర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments