అభినందించిన జిల్లా కలెక్టర్
స్పాట్ వాయిస్, నర్సంపేట: విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను వెలికితీసి వారి ప్రతిభకు పదును పెట్టే కార్యక్రమాన్ని జాతీయ యువజన వైజ్ఞానిక సదస్సు వారు స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం వారిచే వరంగల్ జిల్లాలోని ఏవీవీ జూనియర్ కాలేజీలో నిర్వహించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ప్రదర్శనలో 40 ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. ఇందులో నర్సంపేట పట్టణానికి చెందిన డఫోడిల్స్ సీబీఎస్సీ పాఠశాల నుంచి సుఫియాన్, కళ్యాణ్ (10వ తరగతి) ప్రదర్శించిన ‘స్క్రాకెట్ సైడ్ స్టాండ్ రిట్రివ్ సిస్టమ్, ఆల్కాహాల్ డిటెక్షన్ ఇగ్నిషన్ లాకింగ్ సిస్టమ్’ అనే ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి, జిల్లా విద్య శాఖ అధికారి జ్ఞానేశ్వర్, ఏఎంఓ సృజన్ తేజ ప్రాజెక్టు తయారీకి ఎంపిక కావడానికి తగు సూచనలు సలహాలు అందించిన పాఠశాల కరస్పాండెంట్ చింతల నరేందర్ , పాఠశాల సెక్రటరీ సాయి కీర్తన రోహిత్, విద్యార్థులకు గైడ్ టీచర్ గా వ్యవహరించిన సాయి కిరణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అజీముద్దీన్, వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్ రీటా,హెచ్. ఆర్. డి విజయలక్ష్మిలను అభినందించారు.
జాతీయస్థాయికి ఎంపికైన డఫోడిల్స్ విద్యార్థులు
RELATED ARTICLES
Recent Comments