డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి
స్పాట్ వాయిస్, గణపురం : రాష్ట్రంలోని ఉద్యోగులకు రావాల్సిన డీఏ, పీఆర్సీలను వెంటనే చెల్లించాలని, సీపీఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డీటీఎఫ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు. గురువారం డీటీఎఫ్ గణపురం మండల కమిటీ ప్రధాన కార్యదర్శి రాంబాబు ఆధ్వర్యంలో మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా తిరుపతి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతో ఆవేదనతో పెండింగ్ డీఏల కోసం ఎదురుచూస్తూ నిరాశ చెందుతున్నారని వాపోయారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఇబ్బందులు పెట్టకుండా ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు విద్యారంగ సమస్యలతో పాటు ఆర్థికపరమైన అంశాలను వెంటనే పరిష్కరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలోనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్.వీరన్న, జిల్లా కౌన్సిలర్ లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు హెచ్ఎం వెంకటేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు.
డీఏ, పీఆర్సీలను వెంటనే చెల్లించాలి
RELATED ARTICLES
Recent Comments