సుఖంగా చావొచ్చు..
ఇందుకోసమే సూసైడ్ పాడ్..
తొలిసారి అమెరికాకు చెందిన మహిళ ఆత్మహత్య..
2019లో సూసైడ్ పాడ్ ఆవిష్కరణ
స్పాట్ వాయిస్, డెస్క్: సూసైడ్ పాడ్.. ఆత్మహత్య పేటిక వినడానికి కొత్తగా ఉంది కదూ. ప్రశ్చాత్య దేశాల వింత పోకడలో కనిపెట్టిన సరికొత్త హాయ్ చావు పరికరం ఇది. వైద్య పరిరక్షణ, నొప్పి లేకుండా మరణించే అవకాశం దీని ద్వారా లభిస్తుంది. దీన్ని స్విట్జర్లాండ్ లో 2019లో వెనిస్ డిజైన్ ఫెస్టివల్‌లో సూసైడ్ పాడ్‌ను ఆవిష్కరించారు. ప్రస్తుతం దీని సాయంతో ఒకరు ఆత్మహత్య చేసుకోగా.. మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అమెరికాకి చెందిన 64 ఏళ్ల మహిళ మేరీషాజన్ అటవీ ప్రాంతంలో ‘ఆత్మహత్యా పేటిక’ (సూసైడ్ పాడ్) సాయంతో ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమెకు సహకరించిన పలువురు వ్యక్తులను దక్షిణ స్విట్జర్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకుని క్రిమినల్ కేసు పెట్టారు. ఎవరైన తమ ఇష్టంతో చనిపోవాలనుకునేందుకు వినియోగించే ఈ సూసైడ్ పేటికను సార్కో అని అంటారు. ఇప్పటివరకు దీని సాయంతో ఎవరూ ఆత్మహత్య చేసుకోలేదు. ఇప్పుడు ఈ సార్కో సాయంతో ఇష్టపూర్వకంగా ఆత్మహత్య చేసుకున్న మొదటి వ్యక్తిగా ఆ మహిళ నిలిచింది.
నిమిషాల్లోనే..
ఒక మనిషి పట్టేలా శయ్య ఉన్న ఈ పేటిక లోపలికి వెళ్లి, మీట నొక్కితే సీల్డ్ ఛాంబర్‌లోకి నైట్రోజన్ వాయువు పేటికలో నిండిపోతుంది. లోపల నిద్రపోతున్న వ్యక్తి కొన్ని నిమిషాల్లో ఊపిరాడక మరణిస్తాడు. బటన్‌ను నొక్కడం ద్వారా బ్లింక్, సంజ్ఞ లేదా వాయిస్ నియంత్రణ కూడా సూసైడ్ పాడ్ నుంచి చేయవచ్చు. తీవ్రమైన అనారోగ్యం లేదా చలనశీలత సమస్యల కారణంగా స్వరంతో కమ్యూనికేట్ చేయలేని వారికి కంటి కదలిక ద్వారా దీన్ని ఆపరేట్ చేయవచ్చు.
Recent Comments