Monday, September 23, 2024
Homeటాప్ స్టోరీస్రేవంత్ పోస్టు ఊస్టేనటా..!

రేవంత్ పోస్టు ఊస్టేనటా..!

పీకించేంది ముమ్మాటికి పొంగులేటే..
మాజీ మంత్రి కేటీఆర్..

స్పాట్ వాయిస్, బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమృత పథకంలో తాను ఆరోపించిన విధంగా అవినీతి జరగలేదని తేలితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కాదు., రాజకీయ సన్యాయం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. తనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన ఘాటైనా కౌంటర్ ఇచ్చారు. రేవంత్ ను మంత్రి పొంగులేటి ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఈ విషయంలో ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ నే రాజీనామా చేయాల్సి వస్తుందని కేటీఆర్ జోస్యం చెప్పారు.

దగుల్బాజీలు…
రాజీనామా చేయాల్సిన దగుల్బాజీలు ఈ ముఖ్యమంత్రి ఆయన మంత్రులే అని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ మంత్రులకు చట్టాలు మాత్రమే కాదు, చుట్టరికాలు కూడా తెలిసినట్టు లేదని ఎద్దేవా చేశారు. భార్య తమ్ముడు బావమరిది కాకుండా ఇంకేమి అవుతాడో పొంగులేటి చెప్పాలన్నారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను కూడా నేను ప్రస్తావించిన నేపథ్యంలో పొంగులేటి ఆగమేఘాలమీద ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారని అన్నారు. రూ.1137 కోట్ల రూపాయల అవినీతి జరిగిన, ఒక్క రూపాయి అవినీతి జరిగిన ఈ చట్టం వర్తిస్తుందనే విషయం ఆయన తెలుసుకోవాలన్నారు. పొంగులేటికి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్దామన్నారు., లేదంటే కేంద్రంలోని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లేదా మరి ఏదైనా ఏజెన్సీ దగ్గరకైనా వెళ్దాం అన్నారు. గతంలో ఉన్న ఫైల్స్ తో పాటు ఇప్పుడు జరిగిన టెండర్ల వ్యవహారం పైన వివరాలు వారి ముందు ఉంచుదామన్నారు. ఆయన న్యాయంగా తీర్పు చెప్పిన తర్వాత నేను చెప్పింది అబద్ధమంటే రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా అని సవాల్ చేశారు.
అంతా పొంగులేటికి తెలుసు..
రేవంత్ రెడ్డి పదవిని ఊడ బీకటానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప పదవులు పోయినట్లే రేవంత్ కూడా కోల్పోబోతున్నాడని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ టెండర్ల వ్యవహారంలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రికి, మంత్రి పొంగులేటికి తెలుసు అన్నారు. ముఖ్యమంత్రి ఆశ్రిత పక్షపాతం లేకుండా బంధువులకు అక్రమంగా లాభం చేయను అని ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్ అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు. కేవలం రెండు కోట్ల లాభం ఉన్న బావమరిది కంపెనీకి రూ.1000 కోట్ల కాంట్రాక్టు ఇచ్చి అవినీతి జరగడం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా..? అని నిలదీశారు. ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధుల వ్యవహారాలకు సంబంధించిన అంశంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నుంచి మొదలుకొని బీజేపీకి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడటం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధుల్లో అవినీతి జరుగుతున్నా వారు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతున్నానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తరచుగా చెప్తున్న ఫోర్త్ సిటీ కాదని.. ముచ్చర్ల ఫోర్ బ్రదర్స్ సిటీ అని ఆరోపించారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన తమకు ఎక్కడ అవినీతి జరుగుతుందో తెలియదా? అని అన్నారు. కొడంగల్ లిఫ్ట్ కథ సహా.. సీఎం కుటుంబ సభ్యుల అవినీతిని తేలుస్తామని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అవినీతిపైన మా దగ్గర సమాచారం ఉందన్నారు. ఈ అవినీతిని వరుసగా బయటపెడతామని కేటీఆర్ హెచ్చరించారు. తన బావమరిదికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం రేవంత్ మెడకు చుట్టుకుంటుందని కేటీఆర్ అన్నారు. భార్య సోదరుడు బావమరిది కాకుండా ఏమవుతారు? అని ప్రశ్నించారు. బావమరిది వ్యవహారంలో ఇరికిపోయానని సీఎంకు కూడా తెలుసునని అన్నారు. చట్టాలే కాదు.. చుట్టరికాలు కూడా ప్రభుత్వ పెద్దలకు తెలియనట్లుందని కేటీఆర్ విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సీజే వద్దకు మంత్రి పొంగులేటి తనతో కలిసి రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments