Sunday, November 24, 2024
Homeతెలంగాణరాజీనామాకు సిద్ధం.. కేటీఆర్ సిద్ధమా..?

రాజీనామాకు సిద్ధం.. కేటీఆర్ సిద్ధమా..?

పరువు నష్టం దావా వేస్తా..
‘అమృత’లో రూ.8,888 కోట్లు టెండర్లు పిలిచినట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ..
నిరూపించకపోతే రాజీనామా చేయాలి..
కేటీఆర్ ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వెళ్తా..
స్పీకర్ ఫార్మాట్లో ఇద్దరం రాజీనామా చేద్దామని మంత్రి పొంగులేటి సవాల్..

స్పాట్ వాయిస్, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రెవిన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, ఆయన వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తామన్నారు. చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమృత్ పథకంలో రూ.8,888 కోట్లకు టెండర్లు పిలిచినట్లు కేటీఆర్ నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు.ఒక వేళ కేటీఆర్ తన ఆరోపణలను నిరూపించకపోతే రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. తన సవాల్ ను కేటీఆర్ స్వీకరిస్తే ఆదివారం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. స్పీకర్ ఫార్మాట్లో ఇద్దరం రాజీనామా చేద్దాం అంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు.
శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమృత్ పథకం టెండర్లలో రూ. 8,888 కోట్లకు ఎవరు దక్కించుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే టెండర్లను రూ.3,616 కోట్లకు మూడు ఫ్యాకేజీలుగా టెండర్లను ఆహ్వానించిందని ప్రకటించారు. గత ఎన్నికలకు సరిగ్గా ఒక్క రోజు ముందు బీఆర్ఎస్ ఈ టెండర్లను కట్టబెట్టిందన్నారు. ఆ టెండర్లను పాత ఎస్ఎస్ఆర్ రేట్ల తోనే కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్ల పిలిచిందన్నారు. తాము పిలిచిన టెండర్లలో గతంలో కంటే రూ. 54 కోట్లు తక్కువ టెండర్లు ఇచ్చామన్నారు. అలాగే కేటీఆర్ ఆరోపించినట్లుగా సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి స్వంత బావమ్మర్ది కాదన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్ రెడ్డి అని మంత్రి పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ నుండి ఉపేందర్ బీఆర్ఎస్ కు వెళ్లినందుకుగానూ సృజన్ కాంట్రాక్ట్ యిచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కంపనీని బెదిరించలేదన్నారు. కేటీఆర్ కేవలం గుడ్డ కాల్చి ప్రభుత్వం మీద వేస్తున్నారని మండిపడ్డారు. ఇది మంచిది కాదని హెచ్చరించారు. వాస్తవానికి ప్రభుత్వం కేవలం రూ.3,516 కొట్లు మాత్రమే టెండర్లు ఇస్తేరూ. 8,888 కోట్లుగా ఎలా ప్రచారం చేస్తారని కేటీఆర్ ను నిలదీశారు. నోరు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు అని సూచించారు. చిత్తశుద్ధి ఉంటే కేటిఆర్ నా ఛాలెంజ్ ను నిరూపించిన గంటలో తాను రాజీనామా చేస్తానని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments