Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్అమ్మబాబోయ్.. లడ్డూకు రూ.1.87 కోట్లు

అమ్మబాబోయ్.. లడ్డూకు రూ.1.87 కోట్లు

అమ్మబాబోయ్..
లడ్డూకు రూ.1.87 కోట్లు

స్పాట్ వాయిస్, బ్యూరో: హైదరాబాద్​ బండ్లగూడజాగీర్​లో గణేశ్​ లడ్డూ వేలం పాట రికార్డు సృష్టించింది. ఈ ప్రాంతంలోని కీర్తి రిచ్​మండ్ ​విల్లాస్​లో నిర్వహించిన వేలం పాటలో లడ్డూ ఏకంగా రూ.1.87 కోట్లు పలికింది. గతేడాది ఇదే ప్రాంతంలో నిర్వహించిన వేలంలో రూ.1.20 కోట్లకు లడ్డూను దక్కించుకోగా, ఈసారి దానిని మించి ధర పలకింది. ఈ ఏడాది అత్యధికంగా రూ.1.87 కోట్లకు దక్కించుకున్నారు  11 ఏళ్ల నుంచి కీర్తి రిచ్​మండ్​ విల్లాస్​లో గణేశ్​ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పదకొండో రోజున నిమజ్జనం చేస్తారు. ఆ రోజునే ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి లడ్డూ వేలం పాట మొదలుపెడతారు. అయితే ఈ వేలం పాటలో విల్లాలో ఉన్నవారు మాత్రమే పాల్గొంటారు. లడ్డూ ఎవరికి దక్కినా అందరూ కలిసి సేవా కార్యాక్రమాల కోసం ఆ డబ్బును వినియోగిస్తారు. ఒక్క రూపాయి కూడా వ్యక్తిగత అవసరాల కోసం వాడరు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments