స్పాట్ వాయిస్, కాజీపేట: జాతీయ సాంకేతిక విద్యాలయం (ఎన్‌ఐటీ) వరంగల్ పూర్వ విద్యార్థుల సంఘం, వరంగల్ చాప్టర్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్‌లో ఇంజినీర్స్ డే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్‌ఐటీ వరంగల్ మాజీ ప్రొఫెసర్ పాండురంగారావు హాజరై భారతరత్న, ప్రొఫెసర్ ఎం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఇంజినీర్ డే దినోత్సవం సందర్భంగా ఎన్‌ఐటీ వరంగల్ పూర్వ విద్యార్థుల సంఘం వరంగల్ చాప్టర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ పులి రవికుమార్ అతిథులకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిట్ వరంగల్ పూర్వ విద్యార్థుల సంఘం, వరంగల్ చాప్టర్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ సమాజానికి ఇంజినీరింగ్ ప్రాముఖ్యతపై, సివిల్ ఇంజినీరింగ్ హెడ్ ప్రొఫెసర్ వెంకటరెడ్డి ఇటీవలి వరదల నుంచి పాఠాలు అనే అంశం, కాకతీయ వారసత్వం ప్రచారంలో ఎన్‌ఐటీ వరంగల్ పాత్ర అనే అంశంపై ప్రొఫెసర్ పాండురంగారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పులి రవి కుమార్, చంద్రగిరి శ్రీనివాస్, ప్రొఫెసర్ ఆనంద్ కిషోర్, ప్రొఫెసర్ వేణు వినోద్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments