Tuesday, December 3, 2024
Homeతెలంగాణతిప్పుడే..తిప్పుడు..

తిప్పుడే..తిప్పుడు..

రెండు గంటలుగా వాహనాల్లోనే బీఆర్ఎస్ నేతలు
వాహనాల్లో చక్కర్లు కొట్టిస్తున్న పోలీసులు
స్పాట్ వాయిస్, బ్యూరో: సైబరాబాద్‌ సీపీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రతినిధులును అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రెండు గంటలుగా బస్సుల్లోనే తిప్పుతున్నారు. పోలీసులు రెండు వాహనాల్లో వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నేతలను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా వాహనాల్లోనే తిప్పుతున్నారు.

https://x.com/Brs_Teja/status/1834253807275938051

హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు ఉన్న వాహనాన్ని శ్రీశైలం రోడ్డుపైపు మళ్లించారు. కడ్తాల్‌ మీదుగా కల్వకుర్తికి తరలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే వంద కిలోమీటర్లకుపైగా వాహనాల్లో తిప్పారు. ఓ వాహనాన్ని తలకొండపల్లి, మరొకటి కేశంపేట వైపు తిప్పారు. తలకొండపల్లి వద్ద ఎమ్మెల్యేలను తరలిస్తున్న వాహనాన్ని బీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకున్నాయి. కేశంపేట మండలం కొత్తపేట వద్ద వాహనానికి అడ్డుగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు బైఠాయించారు.

https://x.com/Brs_Teja/status/1834253807275938051

https://x.com/Brs_Teja/status/1834253807275938051

RELATED ARTICLES

Most Popular

Recent Comments