Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్కేయూ భూకబ్జా కేసులపై హైటెన్షన్..

కేయూ భూకబ్జా కేసులపై హైటెన్షన్..

ఫ్లాష్…ఫ్లాష్….
కేయూ భూకబ్జా కేసులపై హైటెన్షన్..
హైకోర్టును ఆశ్రయించిన 9 మంది….
నేడు విచారణకు రానున్న కేసు..
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: కేయూ అధ్యాపక సంఘం, విద్యార్థి సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కేయూ భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంట్లో భాగంగా తాజాగా రెవెన్యూ, ల్యాండ్ సర్వే ఆఫీసు అధికారులతో కలిసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్. అధికారులు చేయించిన సర్వే రిపోర్టు ఆధారంగా వరంగల్ మున్సిపల్ ఆఫీసు అధికారులు కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ మరియు మిగితా వారి ఇంటి నెంబర్లను చూయిస్తూ నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 254 కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని నోటీసులో పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రతి వాదులుగా ప్రిన్సిపాల్ సెక్రెటరీ సెక్రటేరియట్ హైదరాబాద్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్, కాజీపేట సర్కిల్ మున్సిపల్ కార్యాలయ డిప్యూటీ కమిషనర్ మరియు హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రార్ ఆఫీస్ లను పేర్కొన్నారు. కాకతీయ యూనివర్సిటీ ని ప్రతివాదులుగా చేర్చకపోవడం గమనార్హం.


సెక్షన్ 254 కింద డిప్యూటీ కమిషనర్, కాజీపేట సర్కిల్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వారు మరియు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ వారు సెప్టెంబర్ 2న కేయూ పరిధిలో ఉన్న భూముల ఆక్రమణకు సంబంధించి బీసీ కాలనీ గుండ్ల సింగారం కుమారపల్లిలో ఉంటున్న కొందరికి నోటీసులు జారీ చేశారు. వీరిలో 9 మంది హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టులో ఈరోజు వీరి అభ్యర్థనపై వారి న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలను వినిపించనున్నారు. వరంగల్ మున్సిపల్ వారు ఇచ్చిన నోటీసులకు ఇదే నెల 5న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఇచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, సమాధానాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎటువంటి చర్యలు మున్సిపల్ వారు చేపట్టుకూడదని ఉత్తర్వులు వెలువరించాలని హైకోర్టును ఆశ్రయించిన 9 మందికి తాత్కాలిక ఊరట లభిస్తుందా లేదా వేచి చూడాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

Recent Comments