మృతుడి కుటుంబానికి మెపా సాయం..
– ముదిరాజ్ లు దానం చేసే స్థాయికి ఎదగాలి
– మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్
స్పాట్ వాయిస్, నర్సంపేట :ముదిరాజ్ లు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి ఎదగాలని మెపా ( ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు.శుక్రవారం రాత్రి వరంగల్ జిల్లా,నర్సంపేట మండలం,గురిజాల గ్రామానికి చెందిన దండు సాంబయ్య ముదిరాజ్ ఇటీవల అనారోగ్య కారణాలతో బాధపడుతూ మృతి చెందడు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు చనిపోవడంతో వారి పరిస్థితి దీనంగా ఉందని ,కనీసం తినడానికి తిండి దొరకని పరిస్థితి ఉందని తెలుసుకున్న మెపా రాష్ట్ర, వరంగల్ జిల్లా, నర్సంపేట డివిజన్ కార్యవర్గ సభ్యులు బాధిత కుటుంబానికి 50 కేజీ ల బియ్యం అందించారు.
అనంతరం మెపా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి మెపా భవిష్యత్ లో ఎల్లవేళలా సహకారం అందిస్తుందని ,గురిజాల గ్రామ ముదిరాజ్ కుల సభ్యులకు విద్యా ఆవశ్యకత ను వివరించి పిల్లలు చదువుకునేలా ప్రోత్సహించాలని,స్థానిక ఎన్నికల లో ముదిరాజ్ ల సత్తాచాటాలని హితబోధ చేసారు. ముదిరాజ్ లు దానం చేసే స్థాయికి ఎదగాలని అన్నారు. సాంబయ్య ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మెపా రాష్ట్ర కార్యదర్శులు దండు చిరంజీవి ముదిరాజ్, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ ముదిరాజ్,నర్సంపేట డివిజన్ నాయకులు దండు శ్రీను ముదిరాజ్,సింగారపు రామకృష్ణ ముదిరాజ్ నీరటి రాజు ముదిరాజ్,గురిజాల సొసైటీ అధ్యక్షులు సున్నపు భిక్షపతి ముదిరాజ్, గ్రామ కుల పెద్ద మనుషులు కొక్కు రామరాజ్,వీర బోయిన సాంబయ్య,ఇప్ప సదానందం, చింతకాయల సాంబయ్య, కంకనాల రాజు ముదిరాజ్, కొక్కు సదానందం,పెండ్యాల మల్లేష్,కుమ్మరికుంట్ల చంద్ర మౌళి,కొక్కు లింగయ్య,తెప్ప నర్సయ్య,కోక్కు సాంబయ్య, ఇప్ప రాజేష్ ముదిరాజ్ లతో పాటు కుటుంబ సభ్యులు పెండ్యాల రమ,సంపత్, సంతోష్ ముదిరాజ్ లు పాల్గొన్నారు.
Recent Comments