Monday, November 25, 2024
Homeతెలంగాణకేసీఆర్ కు సమన్లు జారీ చేసిన భూపాలపల్లి కోర్టు

కేసీఆర్ కు సమన్లు జారీ చేసిన భూపాలపల్లి కోర్టు

ఆక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలి..
ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు సైతం..
ఆదేశించిన భూపాపల్లి జిల్లా జడ్జి
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వల్ల ప్రజా ధనానికి భారీ నష్టం వాటిల్లిందంటూ భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన కోర్టు గతంలోనే మాజీ సీఎం కేసీఆర్, మరో ఏడుగురికి నోటీసులు పంపింది. నోటీసులు అందుకున్నవారిలో మాజీ మంత్రి హరీశ్ రావు తరపున లలిత రెడ్డి, సుకన్య, అడ్వకేట్లు మెమో అప్పిరియన్స్ అయ్యారు. మెగా కృష్ణారెడ్డి, రజత్ కుమార్, ఎల్అండ్ టీ ఎండీ సురేశ్ కుమార్ తరపున సుప్రీంకోర్టు అడ్వకేట్ అవదాని, శ్రావణ్ రావు మెమో అప్పిరియన్స్ అయ్యారు. ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్లు హరి రామ్, శ్రీధర్ తరపున వరంగల్ అడ్వకేట్ నరసింహారెడ్డి మెమో అప్పిరియన్స్ అయ్యారు. అయితే మాజీ సీఎం కేసీఆర్, ఐఏఎస్ అధికారణి స్మితా సబర్వాల్ కోర్టుకు హాజరుకాకపోవడంతో అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments