Tuesday, December 3, 2024
Homeసినిమావరద బాధితులకు సినీ ఇండస్ట్రీ అండా.. 

వరద బాధితులకు సినీ ఇండస్ట్రీ అండా.. 

  • వరద బాధితులకు సినీ ఇండస్ట్రీ అండా.. 

భారీగా విరాళాలు 

రూ. కోటి విరాళం ప్రకటించిన బాలయ్య, జూనియర్‌ ఎన్టీఆర్‌, మహేష్ బాబు 

స్పాట్ వాయిస్, బ్యూరో: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ అతాలకుతలమయ్యాయి. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు టాలీవుడ్‌ నటీనటులు ముందుకువస్తున్నారు. ఇప్పటికే జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలుగు రాష్ట్రాలకు రూ.50లక్షల చొప్పున రూ.కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సూపర్‌స్టార్‌ మహేశ్ బాబు సైతం వరద బాధితులను ఆదుకునేందుకు తనవంతుగా రూ.కోటి విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రెండు రాష్ట్రాల సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.50లక్షల చొప్పున విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు వరద పరిస్థితిని నుంచి త్వరగా కోలుకోవాలని.. కష్ట సమయంలో సమాజానికి తమవంతుగా సహాయపడాలని ట్వీట్‌ చేశారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ రెండు రాష్ట్రాలకు రూ.50లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. అలాగే, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌, నిర్మాతలు ఎస్ రాధాకృష్ణ, ఎస్ నాగవంశీ రూ.50లక్షలు, హీరో జొన్నగడ్డల సిద్ధు రూ.15లక్షల చొప్పున, విశ్వక్‌సేన్‌ రూ.5లక్షల చొప్పున ప్రకటించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఏపీ సీఎం సహాయ నిధికి రూ.కోటి, అశ్వనీదత్‌ రూ.25లక్షలు, నటి అనన్య నాగళ్ల రూ.5లక్షలు విరాళం ప్రకటించారు.

 

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్న సినీ ప్రముఖులు..

జూ.ఎన్టీఆర్ ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో రూ. 50 లక్షల చొప్పున కోటి విరాళం..

విశ్వక్ సేన్ రూ. 5 లక్షల చొప్పున రూ. 10 లక్షల విరాళం..

రూ.15 లక్షల చొప్పున సిధ్ధూ జొన్నలగడ్డ రూ. 30 లక్షల విరాళం..

రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ప్రకటించిన త్రివిక్రమ్ ,

రాధాకృష్ణ, నాగవంశీ.. రూ. 5 లక్షల చొప్పున రూ.10 లక్షల విరాళం ప్రకటించిన దర్శకుడు వెంకీ అట్లూరి..

రూ.50 లక్షల చొప్పు రూ.కోటి విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ..

ఏపీ సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ప్రకటించిన అశ్వినీదత్

RELATED ARTICLES

Most Popular

Recent Comments