Friday, November 15, 2024
Homeజిల్లా వార్తలుఅత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు..

అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు..

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
దామెర ఎస్సై కొంక అశోక్..
స్పాట్ వాయిస్ దామెర: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దనరి దామెర ఎస్సై కొంక అశోక్ సూచించారు. భారీ వర్షాల వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, నదులు రిజర్వాయర్ల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉంటుందని, వాటి వద్దకి ఎవరు వెళ్లవద్దన్నారు. రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని, వర్షాలు పడేటప్పుడు విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను తాకొద్దని సూచించారు. జలాశయాలు, చెరువులు, వాగులు, ప్రాజెక్టు ల వద్దకు ప్రజలు, మత్స్యకారులు, ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదన్నారు. వర్షం నీటి వల్ల రోడ్డుపై వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున, వరిమిత వేగంతో వాహనాలు నడపాలని సూచించారు. పిల్లలు, యువకులు నది దగ్గరకు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈతలు కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు.విపత్కర పరిస్థితుల్లో సహాయం కోసం డయల్ 100కి, దగ్గరలో ఉన్న పోలీస్ వారికి గాని సమాచారం అంధిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడుతామని ఎస్సై కొంక అశోక్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments