Friday, September 20, 2024
Homeతెలంగాణమానుకోట అతలాకుతలం..

మానుకోట అతలాకుతలం..

మానుకోట అతలాకుతలం..
ప్రాణాలు కాపాడుకోవడానికి ఇండ్లు ఎక్కిన జనం
గాలిలో ఊగుతున్న రైల్వే ట్రాక్..
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: మహబూబాబాద్‌ భారీ వర్షానికి భీతుల్లుతోంది. కేసముద్రం మండలంలో రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఇంటికన్నె వద్ద.. ట్రాక్ కింద నుంచి వరద నీరు పరుగులు తీయడంతో.. ట్రాక్ గాలిలో తేలియాడుతోంది.చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగిపోయింది. నెల్లికుదురు మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు ఎగిపోవడంతో ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. దీంతో రావిరాల గ్రామం పూర్తిగా నీటమునిగింది. ఇండ్లపైకి ఎక్కిన జనాలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమను కాపాడాలంటూ బంధువులకు ఫోన్లు చేస్తున్నారు.

సాగర్‌ అనే వ్యక్తి కుటుంబంతోపాటు, మరో మూడు కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉన్నామని, సహాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. రాజుల కొత్తపల్లి చెరువుకట్ట తెగడంతో నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. అదేవిధంగా నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో అన్నా స్వామి కుంట కట్ట తెగిపోవడంతో రోడ్డు కోతకు గురయింది. గూడూరు శివారులో పాకాల వాగు పొంగి ప్రవహిస్తున్నది. దీంతో గూడూరు, కేసముద్రం, నెక్కొండ, గార్ల, రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక జిల్లాలో అత్యధికంగా ఇంగుర్తిలో 29.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. దంతాలపల్లిలో 29.4 సెం.మీ., మరిపెడలో 29.1 సెం.మీ., తొర్రూరులో 25 సెం.మీ., చినగూడులో 28.5 సెం.మీ., మహబూబాబాద్‌లో 26.6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదయింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments