మరికొద్ది గంటల్లో వెలువడే ఛాన్స్..!
స్పాట్ వాయిస్, డెస్క్: టీపీసీసీ చీఫ్ పదవిపై సస్పెన్షన్, ఉత్కంఠ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొనసాగుతోంది. అసలే కాంగ్రెస్.. ఫ్రీడం ఉన్న పార్టీ. ఎవరి పేరు వస్తుంది.. ఎందుకు వచ్చిందనేది అంత అర్థం కాన్నట్లే ఉంటుంది. అయితే.. టీపీసీసీ ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీ చీఫ్ పేరును ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఇక పేరు ప్రకటనే ఆలస్యం. తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్‌లపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసింది. శనివారం లేదా రేపు ఉదయం మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షుల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు అయినట్లు సమాచారం. అలాగే పశ్చిమ బెంగాల్ పీసీసీ చీఫ్‌గా దీపాదాస్ మున్సీ, కేరళ పీసీసీ అధ్యక్షుడుగా కేసీ వేణుగోపాల్ పేరు ఖరారైంది. ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ స్థానంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అశోక్ గెహ్లాట్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ స్థానంలో ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం భూపేష్ బగెల్ ఉండనున్నారు. ఇక శ్రావణ మాసం పూర్తికానుండడం, మంచి రోజులు అయిపోతుండడంతో.. టీపీసీసీ అధ్యక్షుడి పేరు ప్రకటించాలనే అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది.
టీపీసీసీ చీఫ్ ప్రకటనకు వేళాయే..
RELATED ARTICLES
Recent Comments