Thursday, September 19, 2024
Homeజనరల్ న్యూస్బీజేపీ బుక్ లో సీఎం తప్పులు..

బీజేపీ బుక్ లో సీఎం తప్పులు..

బీజేపీ బుక్ లో సీఎం తప్పులు..

పాలన వదిలేసి చెరువుల మీదపడ్డరు..

ఏం మెంటల్ గాల్లో ఏందో..?

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

 

 స్పాట్ వాయిస్ బ్యూరో: ఆరు గ్యారెంటీలు 66 హామీలు, రైతు రుణమాఫీ, రైతుబంధుపై చర్చ జరగకుండా తప్పించుకుంటున్నావ్.. ఎన్ని రోజులు తప్పించుకుంటావ్.. మిస్టర్ రేవంత్ రెడ్డి తాత్కాలికంగా తప్పించుకోవచ్చు కానీ ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు, నువ్వు ఒకనాడు రెడ్ బుక్ లో రాస్తున్న అని చెప్పావ్.., భారతీయ జనతా పార్టీగా నీ చిట్టా మొత్తం రాసుకుంటున్నాం, సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం అని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ మోర్చాలు, సెల్ ల సంయుక్త కార్యశాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ సభ్యులు కలిగిన పార్టీగా, బలోపేతమైన పార్టీగా బీజేపీ ఉందన్నారు. రాష్ట్రంలో అధికారాన్ని చలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ కొత్త జోష్ తో అనేక రకాల ప్రగల్బాలు పలికినప్పటికీ. వాళ్లకి మనకి ఉన్న ఓట్ షేర్ లో తేడా కేవలం ఐదు శాతం మాత్రమేనని స్పష్టం చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లోనే కాషాయం సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

 

9నెలలకే ఛీ అనిపించుకున్న రేవంత్

కేసీఆర్ ప్రజా క్షేత్రంలో వెలిసిపోవడానికి, ఛీ.. అనిపించుకోవడానికి 9ఏళ్ల పైనే పట్టిందని, ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో వెలిసిపోవడానికి 9 నెలలు కూడా పట్టలేదని ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు, ప్రభుత్వాలు సంపూర్ణంగా విశ్వాసం కోల్పోయాయని, ప్రజల్లో సంపూర్ణమైన విశ్వాసం ఉన్న పార్టీ బీజేపీ ఒక్కటేనని చెప్పారు. ప్రభుత్వ మొత్తం చెరువులు మీద పడిందని, ఏం మెంటల్ గాల్లో అర్థం కావడం లేదన్నారు. 47 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పాలించిందని, నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ ఎంతమంది ముఖ్యమంత్రులు, కలెక్టర్లు, వ్యవస్థలు చట్టం ఉన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఇవాళే కొత్త రాష్ట్రం ఏర్పడ్డట్లుగా, ఆయనే తొలి ముఖ్యమంత్రి అయినట్లుగా ప్రగల్భాలు పలుకుతున్నాడని మండిపడ్డారు. నిన్నటి దాకా ఏం పని చేశాడో, ఆయన చరిత్ర ఏంటో మనకు తెలియదా… మీడియాతో, సోషల్ మీడియాతో ట్రెండింగులు చేయించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయిస్తున్నాడని దుయ్యబట్టారు. సూడో మేధావుల్లారా, సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసి సంబరపడే కొంతమంది వ్యక్తులారా మీకు కనబడుతోంది ఎన్ కన్వెన్షన్, ఫామ్ హౌస్ లే కావచ్చు కానీ మీకు కనపడంది ప్రభుత్వమే పట్టాలిచ్చి, నీళ్లు, కరెంటు కనెక్షన్ లు ఇచ్చి 40 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకొని, పన్నులు కట్టి, మురికి కూపంలో బతికే మా పేదల గురించి ఆలోచన చేయాలన్నారు. హస్మత్ పేట్ లో 125 మందికి, అల్వాల్లో 120 మందికి నోటీసులు వచ్చాయని చెప్పారు. ఫిరంగినాల 85 కిలోమీటర్ల మేర ఉంటుందని, ఆనాడు కట్టినటువంటి ఫిరంగినాల 48 మీటర్ల వెడల్పుతో 50 చెరువులో నీరు నింపేటువంటి కట్టుక అదని, తెలంగాణలో అనేక గొలుసు కట్టు చెరువులు ఉండగా.. ఇవాళ అన్ని పోయాయన్నారు. చెరువుల్లో ఉన్న భూములన్నీ ప్రభుత్వ భూములు కావని, కొన్ని పక్కా పట్టా భూములు ఉంటాయనేది మర్చిపోవదన్నారు.

 

1500 ఇల్లు కట్టించు..

పేదల జోలికొస్తే ఖబర్దార్ అని ఎక్కడికక్కడ నాయకులంతా హెచ్చరించాలని ఈటల కోరారు. భారతీయ జనతా పార్టీగా తప్పకుండా పేదల పక్షాన ఉంటామని చెరువులు, కాలువలు కాపాడాల్సిందేనని, అక్రమ కట్టడాలు కూల్చాల్సిందేని ఈటల పేర్కొన్నారు. కానీ పేదల జోలికి రావద్దు… వస్తా అంటే మూసి పక్కన నివసిస్తున్న 1500 మందికి ఇల్లు ఇస్తానని చెప్పావు మొట్టమొదటిగా ఇల్లు కట్టి వాటిని కూల్చే ప్రయత్నం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments