వరంగల్ లోనే కాకతీయ తోరణం తొలగించారు..
తెలంగాణ రాజముద్రను మార్చిన మున్సిపల్ కార్పొరేషన్
ఫైర్ అవుతున్న ఓరుగల్లు ప్రజలు
స్పాట్ వాయిస్, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలంగాణ రాజముద్రను మార్చడంతీవ్ర చేర్చగా మారింది. ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైనకాకతీయ తోరణం, చార్మినార్‌లతో ఈ వెకిలి పనులు ఏంటంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట అధికారులు ఏర్పాటు చేసారు. అయితే ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారంటూ జనo ప్రశ్నిస్తున్నారు. దీనికి కారకులెవరో కనుక్కుని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజముద్ర మార్చడం పై తీవ్ర విమర్శలు రావడం తో వరంగల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి పాత రాజముద్ర ఉన్న లోగో తో మళ్ళీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
Recent Comments