ప్రతిపాదనలు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం..
స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డుల మంజూరు కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే శనివారం సచివాలయంలో కొత్త రేషన్ కార్డుల కోసం మంత్రివర్గ ఉప సంఘం సమావేశమై చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేబినెట్ కమిటీ సభ్యులు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదరరాజ నరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పౌర సరఫరాల కార్యదర్శి డీఎస్ చౌహాన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి చిరిస్తినాజ్ చొంగతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రతిపాదనలు చేశారు. తెల్ల రేషన్ కార్డుకు గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం రూ. లక్షన్నర లోపు, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు.. అదే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 2 లక్షలు మించకుండా ఉండాలని నిర్ణయించారు. కార్డుల ప్రతిపాదనల్లో రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు.
Recent Comments