Saturday, September 21, 2024
Homeటాప్ స్టోరీస్ఒక్క రోజు అలా చేస్తే.. ఐదు రోజులు సెలవులే..

ఒక్క రోజు అలా చేస్తే.. ఐదు రోజులు సెలవులే..

ఒక్క రోజు అలా చేస్తే.. ఐదు రోజులు సెలవులే..

నెక్ట్స్ వీక్.. జాయ్.. ఎంజాయ్

స్పాట్ వాయిస్, డెస్క్: ఆగస్టు నెలలో ఒకరోజు అలా చేస్తే ఏకంగా.. ఐదు రోజులు సెలవులు రానున్నాయి. ఈ సెలవులు విద్యార్థులకే కాదు.. ఉద్యోగస్థులకు కూడా. అయితే.. మధ్యలో ఒక్కరోజు మనమే సొంతంగా సెలవు పెట్టుకోగలిగితే మాత్రం.. వరుసగా ఐదు రోజుల పాటు లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చంటూ సజ్జెస్ట్ కూడా చేస్తున్నారు. ఆగస్టు 15వ (గురువారం) తేదీన స్వాతంత్య్ర దినోత్సవం.. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులున్నా.. అది జెండా వందనం వరకు మాత్రమే పరిమితం. కొన్ని ఆఫీసులు, కాలేజీలు అయితే ఆరోజును ముందే హాలీడే ప్రకటించేస్తాయి. కాబట్టి.. ఆరోజు సెలవు కిందికే పరిగణలోకి వస్తుంది. ఆ తర్వాతి రోజున (ఆగస్టు 16న) శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. ఆ రోజున చాలా వరకు స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ప్రకటిస్తారు. దీంతో 15, 16 రెండు రోజులు విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులు రానున్నాయి. అలాగే.. ఆగస్టు 18 ఆదివారం కావడంతో ఎలాగూ హాలీడేనే.. ఇక 19వ తేదీన రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆరోజు కూడా స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగులకు సెలవు హాలీడే. దీంతో.. మరో రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. అయితే.. 15, 16, 18, 19 ఎలాగు సెలవులు ఉన్నాయి. మధ్యలో ఆగస్టు 17 (శనివారం) ఒక్క రోజు మాత్రమే వర్కింగ్ డే ఉంటుంది. అది కూడా స్కూళ్లు, కాలేజీలు, కొన్ని కంపెనీలకు మాత్రమే. ఎలాగూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు శనివారం ఎలాగు వీకెండ్‌. అయితే.. 17 రోజున ఆఫీసు కానీ, స్కూళ్లు, కాలేజీలు ఉన్న వాళ్లు ఆ ఒక్క రోజున సిక్ లీవ్, లేదా హాలీడే గానీ తీసుకుంటే.. వరుసగా 5 రోజులు సెలవులు కలిసి వస్తాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments